إعدادات العرض
‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు…
‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు అనారోగ్యానికి గురయ్యారు
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి (అక్కడ ఉన్నన్ని దినాలు) పాలు ఇచ్చే ఒంటెలను ఇవ్వమని మరియు (వారి అనారోగ్యానికి మందుగా) వాటి మూత్రం మరియు పాలు త్రాగమని ఆదేశించినారు. వారు అక్కడి నుండి (ఒంటెలను ఉంచిన ప్రదేశానికి) వెళ్లిపోయారు. అక్కడ వారు కోలుకున్న తర్వాత, వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఒంటెల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళారు. ఆ వార్త తెల్లవారుజామున తెలిసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి పట్టుకు రావడానికి ప్రజలను పంపారు. సూర్యుడు ఉదయించినప్పుడు, వారిని తిరిగి తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చేతులు మరియు కాళ్ళు నరికివేయాలని, మరియు వారి కళ్ళపై వాతలు పెట్టాలని ఆదేశించారు. తరువాత వారు అల్-హర్రా అనే ప్రదేశములో విసిరివేయబడినారు. అక్కడ వారు నీటి కోసం అడుక్కున్నారు కానీ వారికి నీరు ఇవ్వబడలేదు. అబూ కిలాబా ఇలా అన్నారు: “వారు దొంగతనం చేశారు, చంపారు, విశ్వాసం స్వీకరించిన తర్వాత అవిశ్వాసులుగా మారినారు మరియు అల్లాహ్ మరియు ఆయన దూతపై యుద్ధం చేశారు.”
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili অসমীয়া English ગુજરાતી සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî Македонски Tagalogالشرح
ఉక్ల్ మరియు ఉరైనా తెగల నుండి కొంత మంది పురుషులు ముస్లింలుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చారు, కానీ వారి కడుపు ఉబ్బేలా చేసే వ్యాధి వారిని పట్టుకుంది. మదీనాలో ఆహారం మరియు గాలి వారికి సరిపోకపోవడంతో వారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని జకాత్ కొరకు ఒంటెలను ఉంచిన చోటికి వెళ్లి వాటి మూత్రం మరియు పాలు తాగమని ఆదేశించారు. వారు బయలుదేరారు. అక్కడికి చేరుకుని వారు కోలుకున్నారు, లావుగా, ఆరోగ్యవంతంగా తయారై, తిరిగి తమ శరీరపు ఛాయను సంతరించుకున్నారు. అప్పుడు వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పశువుల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళినారు. ఆ సంఘటన గురించిన వార్త తెల్లవారుజామున తెలిసింది. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి, పట్టుకుని రావడానికి ప్రజలను పంపినారు. వారు పట్టుబడ్డారు. తెల్లవారుజామున, వారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు బందీలుగా తీసుకువచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి చేతులు మరియు పాదాలను నరకమని ఆదేశించారు; పశువుల కాపరికి అలా చేసినందున వారి కళ్ళను పెరికి వేయమని, అగ్నిపర్వతపు ప్రాంతముగా పేరుగాంచిన అల్-హర్రా అనే ప్రాంతములో వారిని పడవేయమని ఆదేశించినారు. అక్కడ వారు నీటి కొరకు వేడుకున్నారు. కానీ వారు చనిపోయే వరకు వారికి నీరు అందలేదు. అబూ ఖిలాబహ్ ఇలా అన్నారు: వారు దొంగతనానికి పాల్బడినారు; హత్యకు పాల్బడినారు, విశ్వాసము స్వీకరించి తిరిగి అవిశ్వాసులుగా మారినారు; మరియు అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి వ్యతిరేకంగా యుధ్ధం చేసినారు.فوائد الحديث
ఏ పశువుల మాంసము తినడానికి అనుమతించబడినదో, వాటి మూత్రము కూడా శుధ్ధమైనదే.
ఒంటె పాలు మరియు మూత్రములతో చికిత్స చేయుట మరియు మందుగా ఉపయోగించుట షరియత్ ప్రకారం సరియైనదే.
ఇందులో “ఖసాస్” (చట్టపరమైన ప్రతీకారము) లో సమానత్వం యొక్క చట్టబద్ధతను గమనించవచ్చు; అయితే శరీర భాగాలను ఖండించడం యొక్క నిషేధము చట్టబద్ధమైన ‘మకాఫహ్ వల్ ఖిసాస్’ (చట్టబధ్ధమైన ప్రతిఫలం మరియు ప్రతీకారం) కిందకు రాని వాటిపై ఆధారపడి ఉంటుంది. (అంటే చట్టబద్ధమైన ప్రతీకారంలో (మకాఫా లేదా ఖిసాస్) భాగమైనప్పుడు తప్ప, అటువంటి చర్యలు (శరీర భాగాలను ఖండించడం వంటివి) నిషేధించబడతాయని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నది).
ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఒక సమూహానికి మరణ శిక్ష విధించడం, వారు ఆ వ్యక్తిని ద్రోహం ద్వారా హత్య చేసినా లేదా దోపిడీ ద్వారా చంపినా – ఇది షరియత్ ప్రకారం సరియైనదే.