إعدادات العرض
నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో…
నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత
అబూ సలమ బిన్ అబ్దుర్రహ్మాన్ ఉల్లేఖన, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్-అన్సారీ రదియల్లాహు అన్హుమా దైవవాణి (వహీ) గురించి వివరిస్తూ ఇలా పలికినారు - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత భూమికి మరియు ఆకాశానికి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నాడు. నేను అతనిని చూసి భయపడ్డాను. నేను తిరిగి వచ్చి ఇలా అన్నాను: నాపై దుప్పట కప్పండి. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!1 లే! ఇక హెచ్చరించు!} [ముద్దస్సిర్: 2] నుండి {మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!} [ముద్దస్సిర్: 5] ఈ ఆయతు వరకు. ఆ తర్వాత దైవవాణి అవతరణ ప్రక్రియ గొప్ప శక్తితో మరియు నిరంతరం కొనసాగింది».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Indonesia Kiswahili ភាសាខ្មែរ English ગુજરાતી Hausa Tagalog Русский മലയാളം मराठी Српски සිංහල ಕನ್ನಡ हिन्दी اردوالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవక్త పదవి ప్రారంభంలో వహీ (దైవవాణి) అవతరించడం ఆగిపోవడం గురించి వివరిస్తూ ఇలా తెలిపారు: నేను మక్కా వీధులలో నడుస్తుండగా, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. నేను నా దృష్టిని పైకి ఎత్తి చూశాను, అక్కడ హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత జిబ్రయీల్, ఆకాశం మరియు భూమి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నారు. ఆయనను చూసి నేను భయభ్రాంతులకు గురయ్యాను, వెంటనే నా ఇంటివారి వద్దకు తిరిగి వెళ్లి, "నన్ను దుప్పటితో కప్పండి" అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!} అంటే తన వస్త్రంలో చుట్టుకున్నవాడా, {లే!} ప్రబోధన కొరకు. {ఇక హెచ్చరించు} నీ సందేశాన్ని విశ్వసించని వారిని. {మరియు మీ ప్రభువు} మరియు మీ ఆరాధ్య దైవాన్ని {గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)} మరియు ఆయనను ప్రశంసించు మరియు ఆయన ఘనత ప్రకటించు. {وَثِيَابَكَ} అనగా నీ వస్త్రాలను {فَطَهِّرْ} మాలిన్యాల నుండి పరిశుభ్రంగా ఉంచుకో, {وَالرُّجْزَ} అనగా విగ్రహాలు మరియు ప్రతిమల ఆరాధనను {فَاهْجُرْ} వదిలివేయి, ఆ తర్వాత కాలంలో దైవవాణి (వహీ) బలపడి, అధికమైంది (తరచుగా అవతరించడం మొదలైంది).فوائد الحديث
{పఠించు (ఇఖ్రా)!} అను మొట్టమొదటి దైవవాక్కు అవతరించిన తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దైవవాణి (వహీ) అవతరణ కొద్ది కాలం పాటు నిలిచిపోయింది.
పరీక్షలు తొలగిపోయిన తర్వాత, అల్లాహ్ కు కృతజ్ఞతగా వాటి గురించి ప్రస్తావించవచ్చు.
{اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ} అవతరించిన తర్వాత, మొట్టమొదట అవతరించినది మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {يَا أَيُّهَا الْمُدَّثِّرُ}.
మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు ఆయనపై తన వహీని నిరవధికంగా అవతరింపజేయడం ద్వారా ఆయనను గొప్పగా అనుగ్రహించాడు.
మహోన్నతుడైన అల్లాహ్ వైపుకు ఆహ్వానించాలి, విముఖత చూపేవారిని హెచ్చరించాలి మరియు విధేయులకు శుభవార్త ఇవ్వాలి.
నమాజ్ కొరకు వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి, దీనికి నిదర్శనంగా వారు అల్లాహ్ యొక్క ఈ వాక్కును ఉదహరిస్తారు: {మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!}.
దైవదూతలను మరియు అల్లాహ్ వారికి అప్పగించిన పనులను మరియు ఇతర బాధ్యతలను విశ్వసించడం తప్పనిసరి అని తెలుస్తున్నది.
التصنيفات
Prophet's Lineage