القزع

ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఖజా’ (అల్ ఖజా – الْقَزَعِ) చేయుటను నిషేధించినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. (తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి, కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ‘ఖజా’ అంటారు) ఈ నిషేధము పురుషులందరికీ సమానంగా వర్తిస్తుంది, పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృధ్ధులు అందరికీ. అయితే స్త్రీలు తమ తలను క్షవరం చేసుకోవడానికి, లేదా చేయించుకోవడానికి అనుమతి లేదు. అది వారి కొరకు పూర్తిగా నిషేధము.

فوائد الحديث

ఇందులో మానవుని బాహ్య రూపానికి సంబంధించి ఇస్లామీయ షరియత్ జాగ్రత్తలు తీసుకోవడం చూస్తాము.

التصنيفات

జన్మించిన పిల్లవాడి ఆదేశాలు, దుర్గుణాలు