“ఎరుపు రంగు (కండువా లాంటి) పైవస్త్రములో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందమైన ఛాయ కలిగిన వ్యక్తిని…

“ఎరుపు రంగు (కండువా లాంటి) పైవస్త్రములో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందమైన ఛాయ కలిగిన వ్యక్తిని నేను ఎపుడూ చూడలేదు

బరా’అ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఎరుపు రంగు (కండువా లాంటి) పైవస్త్రములో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందమైన ఛాయ కలిగిన వ్యక్తిని నేను ఎపుడూ చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుట్టు ఆయన భుజాలను తాకుతూ, భుజాల మధ్య భాగం వరకు ఉంటుంది; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చాలా పొడవైన వ్యక్తీ కాదు, అలాగని పొట్టి వ్యక్తి కూడా కాదు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

అల్-బరా' ఇబ్న్ 'అజీబ్' రదియల్లాహు అన్హు, భుజాల వరకు పొడవాటి జుట్టు కలిగి, నల్లటి ఇజార్ మరియు ఎర్రటి చారలు ఉన్న పైన కప్పుకొను వస్త్రము ధరించిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందంగా ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శారీరక లక్షణాలలో విశాలమైన భుజాలు, విశాలమైన ఛాతీ, మరీ పొడవైన వ్యక్తి, లేదా మరీ పొట్టి వ్యక్తి కాకుండా సగటు ఎత్తు కలిగి ఉండడం ఉన్నాయి.

فوائد الحديث

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని బాహ్య సౌందర్య లక్షణాలను, అంటే ఆయన జుట్టు అందం, ఛాతీ విశాలత, అందమైన ఎత్తు మరియు ఇతర లక్షణాలను స్పష్టంగా వివరించడం ఈ హదీథులో చూస్తాము.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ఎంత గొప్ప సహచరులు అంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంతగానో ప్రేమించేవారు. వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భౌతిక శరీరం వర్ణను మరియు వారి నైతిక లక్షణాలను వారి తరువాత వచ్చిన తరం వారికి వివరంగా అర్థమయ్యేలా తెలియజేసినారు.

التصنيفات

భౌతిక లక్షణాలు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్త్రాలు