ఒక వస్తువును అమ్మేందుకు అల్లాహ్ పై ప్రమాణం చేయడం అనేది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది అసలు లాభాన్ని…

ఒక వస్తువును అమ్మేందుకు అల్లాహ్ పై ప్రమాణం చేయడం అనేది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది అసలు లాభాన్ని నాశనం చేస్తుంది.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక వస్తువును అమ్మేందుకు అల్లాహ్ పై ప్రమాణం చేయడం అనేది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది అసలు లాభాన్ని నాశనం చేస్తుంది.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త ముహమ్మద్ ﷺ వ్యాపార లావాదేవీలలో ప్రమాణాలు చేయడాన్ని మరియు వాటిని మరీ తరచుగా చేయడాన్ని గురించి హెచ్చరించారు — ఎలాంటి ఒత్తిడి లేకుండా, నిజాయితీపరంగా ఆ వ్యాపార లావాదేవీ జరుగుతున్నా సరే. ఎందుకంటే అవి వస్తువు అమ్మకానికి సహాయపడవచ్చు, కానీ ఆ లాభంలోని శుభాలను హరించి వేస్తుంది, సంపద నశించడం మొదలవుతుంది. ప్రవక్త ﷺ హెచ్చరిక: దాని వలన మహోన్నతుడైన అల్లాహ్‌‌ మానవుడి ధనాన్ని ఇలాంటి కొన్ని మార్గాల్లో నశింపజేస్తాడు — ఉదాహరణకు: దొంగతనం, అగ్నిప్రమాదం, నీళ్ళలో మునిగి పోవడం, బలవంతంగా లాక్కోబడటం, దోపిడి, లేదా ఇతర అనూహ్యమైన ఆపత్తులు (అపాయాలు, దుర్ఘటనలు). ఇవన్నీ అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కోల్పోయినప్పుడు కలిగే ఫలితాలు.

فوائد الحديث

అల్లాహ్‌ పై ప్రమాణం చేయడం అనేది ఒక మహాపవిత్రమైన విషయం. ఇది స్పష్టంగా అట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయ వలసి ఉన్నది.

"హరాం (అనుమతించని) మార్గంలో సంపాదించిన ధనం — అది ఎంత ఎక్కువగా సంపాదించినా — అందులో శుభం (బర్కత్) ఉండదు, దాని వలన మంచి ఫలితమూ కలుగదు.

ఖారీ (رحمه الله) ఇలా చెప్పినారు: హరాం సంపాదనలో ఉండే శుభం (బర్కత్) ఎలా పోతుందంటే: ఆ ధనానికి నష్టం జరగటం అంటే అత‌డు సంపాదించిన ఆస్తి న‌ష్టాల వలన పోతుంది – ఇంకా అది దొంగతనం, అగ్నిప్రమాదం, ఇతర ప్రమాదాలలో లేదా వ్యర్థ ఖర్చులో నశిస్తుంది. లేదా దానితో అతడు స్వయంగా ప్రయోజనం పొందలేడు — ఆ ధనం ఈ లోకంలో మేలు ఇవ్వదు, పరలోకంలో పుణ్యం ఇవ్వదు. లేదా అది అతని వద్ద ఉండినా, దాని నుండి అనారోగ్యం వలన లేదా వేరే ఇతర కారణాల వలన అతడికి ప్రయోజనం లేకుండా పోతుంది, లేదా చివరికి దానిని పొందిన అతడి వారసుల వద్ద అతడు ప్రశంసించబడని (గౌరవించబడని) వ్యక్తిగా మారతాడు. అది అతనికే శాపంగా మారుతుంది.

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా వ్యాఖ్యానించారు: "వ్యాపారంలో తరచుగా ప్రమాణాలు చేయడాన్ని ప్రవక్త ﷺ నిషేధించారు. ఎలా చూసినా — అవసరం లేకుండా ప్రమాణం చేయడం మక్రూహ్ (ఇస్లాంలో నిషిద్ధతకు దగ్గరగా ఉండే అపవిత్రమైన పని). మరియు దీనితో పాటు, ఒక వస్తువు అమ్ముకోవడానికి కొనుగోలుదారుడిపై ఒత్తిడి చేసే విధంగా ప్రమాణాలు చేయడం, కొనుగోలుదారుడిని మోసపోయేలా చేస్తుంది — అది నిజమని అతడు నమ్మేస్తాడు.

తరచుగా ప్రమాణాలు చేయడం అనేది - తౌహీద్ (అల్లాహ్‌ ఏకత్వాన్ని నమ్మే విశ్వాసం) లో ఒక లోపాన్ని, ఈమాన్ (దైవవిశ్వాసం) లో ఒక తక్కువతనాన్ని సూచిస్తుంది. ఎందుకు అంటే: క్రమం తప్పకుండా ప్రమాణాలు చేయడం మనిషి రెండు ప్రమాదాలను ఎదుర్కొంటాడు: ప్రమాణాల పట్ల అశ్రద్ధ (గౌరవించకపోవడం) పెరగడం, అల్లాహ్ పేరుతో మాట్లాడడం చాలా పెద్ద విషయం అయినా, తరచూ చేయడం వల్ల ఆ గౌరవం తగ్గిపోవడం. రెండవది అబద్ధం చెప్పే ప్రమాదం - ఎవరు తరచుగా ప్రమాణాలు చేస్తాడో, అందులో ఒక్క సందర్భమైనా ఖచ్చితంగా అబద్ధమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముస్లింలు తక్కువగా మాత్రమే ప్రమాణం చేయాలి, అవసరం ఉంటేనే చేయాలి. తరచూ అల్లాహ్ పేరు ఉపయోగించకూడదు. అల్లాాహ్ వాక్కు: – సూరహ్ అల్ మాయిదహ్ 5:89 (وَاحْفَظُوا أَيْمَانَكُمْ) "మీ ప్రమాణాలను కాపాడుకోండి" అని అల్లాహ్ స్వయంగా ఆదేశించాడు.

التصنيفات

మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు