إعدادات العرض
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము
ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము, ఇలా అనబడుతుంది: నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ? కావున మేము చివరివారము మరియు మొదటివారము.
[ప్రామాణికమైన హదీథు] [ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:]
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ English ગુજરાતી සිංහල Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски Türkçe हिन्दी اردوالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, వారి సమాజము కాలపరంగా చివరి సమాజము మరియు ప్రళయదినాన మొట్టమొదట లెక్క తీసుకోబడే సమాజము కూడా అదే. ప్రళయదినాన ఇలా పిలవబడుతుంది: 'నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ ఉన్నారు?'. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు కావడాన్ని బట్టి ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. కాబట్టి మనము మొదట లెక్క కోసం పిలవబడతాము. మనము ఈ ప్రపంచంలో చిట్టచివరి వాళ్ళము, కానీ తీర్పు రోజున లెక్కలో మరియు స్వర్గంలో ప్రవేశించడంలో మొదటివాళ్ళం.فوائد الحديث
గత సమాజాలపై ఈ ఉమ్మత్ యొక్క విశిష్టత.
التصنيفات
పరలోక జీవితం