“ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”

“ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒక వ్యక్తి – మరో వ్యక్తి “ఖుల్ హువల్లాహు అహద్...” సూరాహ్’ను (సూరతుల్ ఇఖ్లాస్ ను) పలుమార్లు అదే సూరహ్ ను పునరావృతం చేస్తూ పఠిస్తూ ఉండగా చూచినాడు. మర్నాడు ఉదయం అతడు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు వివరించినాడు; ఆ వ్యక్తి ఆ సూరాహ్ ను తగినన్ని సార్లు పఠించలేదు అనే ధోరణిలో. దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఒక వృత్తాంతాన్ని ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒక వ్యక్తి - మరొక వ్యక్తి రాత్రంతా “ఖుల్ హువల్లాహు అహద్..” సూరహ్ ను, దానికి ఇంకేమీ జోడించకుండా, కేవల ఆ ఒక్క సూరానే పునరావృతం చేస్తూ పఠించడం విన్నాడు. మర్నాడు ఉదయం ఆ వ్యక్తి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయం చెప్పాడు. అతడు చెప్పడం – ఆ వ్యక్తి చేసినది చాలా తక్కువగా ఉందని భావిస్తున్నట్లుగా ఉంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నొక్కి చెబుతున్నట్లుగా ప్రమాణం చేస్తూ మరీ ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో, ఆయన సాక్షిగా, అది ఖుర్’ఆన్ లో మూడో వంతుకు సమానం.”

فوائد الحديث

ఇందులో సూరతుల్ ఇఖ్లాస్ యొక్క ఘనత మరియు అది ఖుర్’ఆన్ లో మూడో వంతుకు సమానం అని తెలుస్తున్నది.

రాత్రి నమాజు సమయంలో (తహజ్జుద్’లో పూర్తి సూరాలు, పెద్దపెద్ద ఆయతులు కాకుండా) కొన్ని ఆయతులే అయినా సరే పఠించడానికి అనుమతి ఉన్నది, అవి చిన్న ఆయతులే అయినప్పటికీ వాటినే పునరావృతం చేయడానికి అనుమతి ఉన్నది, అయితే దానిని తగ్గించరాదు.

అల్ మాజిరీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కొంతమంది ధార్మిక పండితులు (ఉలమాలు) ఇలా అన్నారు: “దీని అర్థం ‘ఖుర్’ఆన్ మూడు భాగాలుగా ఉన్నది; గాథలు, ఆదేశాలు మరియు అల్లాహ్ యొక్క నామములు మరియు గుణవిషేషణాలు. “ఖుల్ హువల్లాహు అహద్... (ఓ ప్రవక్తా! ఇలా అను: "ఆయనే అల్లాహ్‌! ఏకైకుడు...) ఇది పూర్తిగా, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క గుణవిషేషణాలకు సంబంధించినది. అంటే మూడు భాగాలలో ఒక భాగం.” మరికొంతమంది ఉలమాలు ఇలా అన్నారు: “దీని అర్థము: దీని పఠనం వల్ల వచ్చే ప్రతిఫలం, అదనపు హెచ్చింపు లేకుండా మూడింట ఒక వంతు ఖుర్’ఆన్ పఠనం వల్ల వచ్చే ప్రతిఫలానికి సమానం అవుతుంది.”

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు.