నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని…

నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని చూశాను

ఇబ్రాహీం నఖయీ నుండి, హమ్మామ్ ఇబ్న్ హారిథ్ ఉల్లేఖన: జరీర్ మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేశారు. అప్పుడు ఆయన్ని, 'మీరు ఇలా చేస్తారా?' అని ప్రశ్నించగా, ఆయన ఇలా బదులిచ్చారు: 'అవును, నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని చూశాను. అల్-అఅమష్ తెలిపారు: ఇబ్రాహీం ఇలా అన్నారు: 'వారు ఈ హదీథును చాలా ఇష్టపడేవారు; ఎందుకంటే సూరహ్ మాయిదహ్ అవతరించిన తర్వాత జరీర్ ఇస్లాం స్వీకరించడం జరిగింది.'

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు మూత్ర విసర్జన చేసి, తరువాత ఉదూ చేసినారు. ఆయన తన పాదాలను నీటితో కడగకుండా, తన మేజోళ్ళపై మసహ్ చేసి సరిపెట్టినారు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనతో, "మీరు ఇలా చేస్తారా?!" అని అన్నారు. దానికి ఆయన, "అవును, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసి, తరువాత ఉదూ చేసి, తన మేజోళ్ళపై మసహ్ చేయగా చూశాను" అని అన్నారు. ఉదూ ఆయతు ఉన్న సూరతుల్-మాయిదహ్ అవతరించిన తర్వాత జరీర్ ఆలస్యంగా ఇస్లాం స్వీకరించడం, ఖుఫ్ఫైన్ (తోలు సాక్సుల) పై మసహ్ చేయడం ఆ ఆయతు ద్వారా రద్దు చేయబడలేదని సూచిస్తుంది.

فوائد الحديث

సహాబాలు మరియు తాబయీనులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతును అనుసరించుటలో చాలా శ్రద్ధా, ఆసక్తీ కలిగి ఉండేవారు.

ఇమామ్ అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: విశ్వసనీయమైన పండితుల ఇజ్మా (ఏకాభిప్రాయం) ప్రకారం, ప్రయాణంలో మరియు నివాసంలో, అవసరం ఉన్నా లేకపోయినా సరే, ఖుఫ్ఫైన్ (తోలు సాక్సుల) పై మసహ్ చేయడం అనుమతించబడినది. ఇది ఎంతగా అంటే, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే స్త్రీకి మరియు నడవలేని దీర్ఘకాలిక రోగికి కూడా అనుమతించబడినదే.

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు యొక్క ఘనత, ఆయన తన శిష్యులు పొరపాటుగా అభ్యంతరం చెప్పినా కూడా వారి అభ్యంతరాన్ని సహించే విశాల హృదయం కలిగి ఉండటం.

ఖుఫ్‌పై మసహ్ చేయడాన్ని నిరాకరించి, అది రద్దు చేయబడిందని వాదించిన వారికి ఖండన; ఎందుకంటే జరీర్ రదియల్లాహు అన్హు యొక్క హదీథు సూరతుల్ మాయిదహ్ లోని ఉదూ యొక్క ఆయత్ అవతరించిన తర్వాత వచ్చినది.

ఎవరినైనా మీ విషయాన్ని ఖండించి, తనదే సరియైనదని భావిస్తున్నట్లయితే, మిమ్మల్ని ఖండించి, మీ అభిప్రాయంపై చర్చించే వ్యక్తిపై కోపగించకుండా, బదులుగా ఆ విషయంలో మీ ఆధారాన్ని అతనికి ఉత్తమమైన పద్ధతిలో వివరించాలి.

అవసరమైనప్పుడు చరిత్రను ప్రమాణంగా తీసుకోవడం గురించి తెలుపబడింది.

التصنيفات

మేజోళ్ల పై మరియు అటువంటి వాటిపై స్పర్శించటం