“నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”

“నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (మక్కా నగరానికి వెళ్ళడానికి అనుమతి నిరాకరించబడి) వెంట తీసుకు వెళ్ళిన బలి పశువులను హుదైబియాలోనే వధించి, తిరుగు ప్రయాణంలో సహచరులందరూ దుఃఖం మరియు బాధలో మునిగిపోయినప్పుడు, రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతు అవతరించినది {ఇన్నా ఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా లియఘ్ఫిర లకల్లాహు... (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము; నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి} నుండి మొదలుకుని ఆయన వాక్కు {…ఫౌజన్ అజీమా - ఇది ఒకగొప్ప విజయం.} వరకు [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5]. ఆ సమయములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా అన్నారు: “నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతులు అవతరించినపుడు: {ఇన్నాఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా(1) లియఘ్ఫిరలకల్లాహు మా తఖద్దమ మిన్ జంబిక వమా తఅక్ఖర, వయుతిమ్మ ని’మతహు అలైక సిరాతమ్ముస్తఖీమా(2) వయన్సురకల్లాహు నస్రన్ అజీజా(3) హువల్లజీ అన్’జలస్సకీనత ఫీ ఖులూబిల్ ము’మినీన లియజ్’దాదూ ఈమానన్ మఅ ఈమానిహిమ్, వలిల్లాహి జునూదస్సమావాతి వల్ అర్ది వకానల్లాహు అలీమన్ హకీమా(4) లియుద్’ఖిలల్ ము’మినీన వల్ ము’మినాతి జన్నాతి తజ్’రీ మిన్ తహ్’తిహల్ అన్’హారు ఖాలిదీన ఫీహా వయుకఫ్ఫిర అన్’హుమ్ సయ్యిఆతిహిమ్ వకాన జాలిక ఇందల్లాహి ఫౌజన్ అజీమా(5)} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము(1) నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి మరియు నీకు ఋజు-మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;(2) మరియు అల్లాహ్‌! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి(3) ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని, భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్‌ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.(4) విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్‌ దృష్టిలో ఇది ఒకగొప్ప విజయం.(5)} [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5] ఈ ఆయతులు అవరించినపుడు, సహబాలు (మక్కా ఖురైషీయుల చేత) ఉమ్రా చేయకుండా నిరోధించబడి, అల్ హుదైబియా వద్దనే తాము వెంట తీసుకు వెళ్ళిన బలిపశువులను అక్కడే వధించి, దుఃఖము మరియు నిరాశతో తిరుగు ప్రయాణమయ్యారు. అల్ హుదైబియా వద్ద ఖురైషీయులతో చేసుకున్న శాంతి ఒప్పందం ముస్లిముల ప్రయోజనాలకు మంచిది కాదు అని వారి (సహబాల) నమ్మకం. అటువంటి సమయాన ఈ ఆయతులు అవరించినవి. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఈ మొత్తం ప్రపంచం కంటే కూడా ప్రియమైన ఆయతు నాపై అవతరించినది” ఇలా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆయతును పఠించినారు.

فوائد الحديث

ఇందులో – హుదైబియ ఒప్పందములో, సర్వోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై వర్షించిన ఆశీర్వాదాల, అనుగ్రహాల గొప్పతనం యొక్క ప్రకటన ఉన్నది. ఆయన ఇలా అన్నాడు: {ఇన్నా ఫతహ్’నా లక ఫత్’హన్ ముబీనా} [(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము] (48:1)

అలాగే ఇందులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సహచరులు (సహబాలు) ఆయన ఆఙ్ఞకు లోబడి ఆయనకు విధేయత చూపినందుకు గానూ సర్వోన్నతుడైన వారికి ప్రసాదించిన ఆశీర్వాదాల, అనుగ్రహాల గొప్పతనం యొక్క ప్రకటన ఉన్నది. సర్వోన్నతుడైన ఆయన వారి కొరకు తన వాక్కులను ఇలా అవతరింపజేసినాడు: {లియుద్’ఖిలల్ ము’మినీన వల్ ము’మినాతి జన్నాతి తజ్’రీ మిన్ తహ్’తిహల్ అన్’హారు…} [విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు…] (48:5)

తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులపై – వారికి విజయాన్ని, జయప్రదాన్ని వాగ్దానం చేస్తూ అల్లాహ్ వారికి ప్రసాదించిన అనుగ్రహాల ప్రకటన:

ఇమాం అస్-సాదీ (రహిమహుల్లాహ్), తన తఫ్సీర్’లో ఈ ఆయతు - {ఇన్నా ఫతహ్’నా లక ఫత్’హన్ ముబీనా} [(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము] (48:1) – పై వ్యాఖ్యానిస్తూ ఇలా రాసినారు: “ఈ ప్రస్తావించబడిన “విజయము”, బహుదైవారాధకులు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఉమ్రా చేయకుండా నిరోధించినపుడు, హుదైబియా వద్ద జరిగిన శాంతి ఒప్పందాన్ని సూచిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ తరువాత కుదిరిన ఒప్పందం ఏమింటేటంటే: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బహుదైవారాధకులతో 10 సంవత్సరాలపాటు యుధ్ధ విరామము పాటించాలని, మరియు ఉమ్రా ఈ సంవత్సరం కాకుండా మరుసటి సంవత్సరం చేయాలి అని ఇరుపక్షాల మధ్య ఒక ఒడంబడిక జరగాలి అని. అంతేకాక బహుదైవారాధకులైన ఖురైషీయుల పక్షాన చేరాలనుకునేవారు వారితో ఒడంబడిక చేసుకుని స్వేచ్ఛగా వారి పక్షాన చేరవచ్చు, అలాగే ఇస్లాం స్వీకరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పక్షాన చేరాలకునునేవారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిపై ప్రమాణం చేసి స్వేచ్ఛగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పక్షాన చేరవచ్చు. ఆ ఒడంబడిక ఫలితంగా ప్రజలలో ఒకరి నుండి మరొకరికి ప్రమాదం ఏమీ లేదని, తాము సురక్షితము అనే భావన ప్రబలింది. దానితో అల్లాహ్ యొక్క ధర్మం వైపునకు పిలుపు ఇచ్చే పరిధి విస్తరించింది. ప్రతి విశ్వాసి తాను ఏ ప్రాంతములో ఉన్నా, ఏ స్థానములో ఉన్నా తన విశ్వాసాన్ని ఆచరించగలిగాడు, అల్లాహ్ యొక్క ధర్మం వైపునకు పిలువగలిగాడు; మరియు విశ్వాసం స్వీకరించి ఇస్లాం సత్యాన్ని నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వారు అలా చేయగలిగారు, మరియు సత్యధర్మం పై నిలబడడం సాధ్యమైంది. ఈ ఒడంబడిక కాలములో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇస్లాంను స్వీకరించారు. అందువల్ల అల్లాహ్ దానిని “విజయం” అని పేర్కొన్నాడు, మరియు దానిని “ప్రస్ఫుటమైన, విస్పష్టమైన విజయము” అని అభివర్ణించాడు. ఎందుకంటే బహుదైవారాధకుల దేశాలను జయించడం యొక్క లక్ష్యం అల్లాహ్ యొక్క ధర్మాన్ని గౌరవించడం, కీర్తించడం, ఆయన ధర్మాన్ని మహిమపరచడం; మరియు ముస్లిములను విజయులుగా చేయడం. ఈ విజయం ద్వారా అది సాధించబడింది.

التصنيفات

ఖుర్ఆన్ తఫ్సీర్, ఖుర్ఆన్ సుగుణాలు