إعدادات العرض
“మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?”
“మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?”
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ కూర్చుని ఉన్న కొందరు వ్యక్తుల వద్ద ఆగి, ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?” దానికి వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మాటను మూడుసార్లు పునరావృతం చేసారు. అప్పుడు ఒక వ్యక్తి, “తప్పకుండా ఓ రసూలుల్లాహ్! మాలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో మాకు తెలియజేయండి” అని అన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: «మీలో ఉత్తముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడుతుంది మరియు అతని కీడు నుండి భద్రత లభిస్తుంది. మరియు మీలో అధముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడదు మరియు అతని కీడు నుండి భద్రత లభించదు».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Indonesia Kiswahili ភាសាខ្មែរ English ગુજરાતી Hausa Tagalog Русский മലയാളം मराठी Српски සිංහල ಕನ್ನಡ हिन्दी اردوالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుని ఉన్న తన సహాబాలలో కొందరి వద్ద నిలబడి వారిని ఇలా అడిగారు: మీలో ఉత్తములు ఎవరో మరియు అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా? తమలో ఎవరు ఉత్తములో, ఎవరు అధములో తేలిపోతుందనే భయంతో మరియు అవమానం పాలవుతామేమో అనే భీతితో వారు ఏమీ మాట్లాడకుండా, జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి ముందు ఆ ప్రశ్నను మూడు సార్లు పునరావృతం చేయగా, వారిలో నుండి ఒక వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు: తప్పకుండా ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, మాలో మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో మాకు తెలియజేయండి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విధంగా వివరించారు: “మీలో ఉత్తములు ఎవరంటే – ఎవరి నుండి అయితే మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడతాయో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉంటుందో, మరియు అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడకుండా ఉంటారో. మరియు మీలో అధములు ఎవరంటే – ఎవరి నుండి అయితే ఎటువంటి మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడవో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉండదో, బదులుగా అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడతారో”.فوائد الحديث
ప్రజలలోని మంచివారి గురించి మరియు చెడ్డవారి గురించి వివరించబడింది.
ఇతరులకు చేరే ప్రయోజనాలు మరియు నష్టాలు, వ్యక్తిగతమైన వాటి కంటే గొప్పవి.
మంచి నైతికత, ప్రజలతో మంచిగా వ్యవహరించడంపై ప్రోత్సాహం, మరియు దౌర్జన్యం, చెడు మరియు దురాక్రమణ నుండి హెచ్చరిక ఉన్నది.
التصنيفات
సద్గుణాలు