శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి…

శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు}

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు మర్ఫు ఉల్లేఖనం;శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు}

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేస్తున్నారు :సంకల్పించుకున్న పనిని శకునం కారణంగా ఎవరైతే విరమించుకుంటాడో అతను ఒకరకమైన షిర్కు కు పాల్పడ్డాడు,అనుయాయులు సహాబాలు దైవప్రవక్తను ఈ మహాపాతకానికి పరిహారం ఏమిటి? అని అడిగితే ‘హదీసులో ఉన్నమహత్తర పదాలను పఠించాలని మార్గనిర్దేశం చేయబడింది,ఇందులో కార్యాల భారం అల్లాహ్ పై వేస్తూ మంచి చెడుల శక్తి ఆయనకు మాత్రమే ఉందని ఇతరలకు లేదని ఖండించడం జరిగింది.

فوائد الحديث

శకునం వల్ల తాను చేయవలిసిన పని నుండి ఆగిపోవడం ‘షిర్కు’ అవుతుంది అని ఈ హదీస్ నిరూపిస్తుంది

ముష్రిక్(బహుదైవారాధకుడి)తౌబా ఆమోదించబడుతుంది.

శకునానికి గురైన వ్యక్తి ఏ దుఆ ద్వారా దాని నుండి బయట పడవచ్చో మార్గదర్శనం చేయబడినది

నిశ్చయంగా మంచి మరియు చెడు అల్లాహ్ తరుపు నుండి నిర్ణీతమై ఉన్నాయి.

التصنيفات

బహుదైవారాధన (షిర్క్)