“నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు,…

“నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”

అన్ ను’మాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: పునరుత్థాన దినమున నరకములో అతి తక్కువ శిక్షను పొందే వ్యక్తికి అగ్నితో చేసిన రెండు పాదరక్షలు, మరియు (వాటిని కట్టి ఉంచే) రెండు పట్టీలు తొడగబడతాయి. వాటి వేడి కారణంగా అతని మెదడు రాగి కుండలో ఉడకబెట్టిన పదార్థం తుకతుక ఉడికినట్టుగా మరుగుతుంది. తన కంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ అతనికి కనబడరు (తనకంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ లేరు అని అతడు తలపోస్తాడు), వాస్తవానికి అందరికంటే తక్కువగా శిక్షించబడున్న వ్యక్తి అతడే అయినప్పటికీ. ఇది అతనికి శారీరకంగా శిక్షించడంతో పాటు అతన్ని మానసికంగా శిక్షకు గురిచేస్తుంది.

فوائد الحديث

ఇందులో నరకంలో విధించబడే ఈ అతి తక్కువ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో పాపపు పనులకు పాల్బడేవారికి మరియు అవిశ్వాసులకు తెలిసేలా ఒక హెచ్చరిక ఉన్నది; తద్వారా వారు దానికి దారితీసే వాటి నుండి దూరంగా ఉండవచ్చు.

నరకాగ్ని నివాసులు వారి చెడు పనుల ఆధారంగా వివిధ స్థాయిలలో ఉంటారు.

ఇందులో నరకాగ్ని శిక్ష (అది అతి తక్కువ శిక్ష అయినప్పటికీ) ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా ఉంటుందో వర్ణించబడినది. అల్లాహ్ మనలను దాని నుండి రక్షించుగాక.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు