إعدادات العرض
ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన…
ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన మరియు నిద్ర కారణంగా మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు
జిర్ ఇబ్న్ హుబైష్ ఉల్లేఖన: నేను మేజోళ్ళపై మసహ్ గురించి అడుగుదామని సఫ్వాన్ బిన్ అస్సాల్ అల్-మురాదీ వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను "జిర్! ఏమిటి ఇలా వచ్చావ్?” అనడిగారు. అందుకు నేను “జ్ఞానసముపార్జన కోసం” అని జవాబిచ్చాను. అది విని ఆయన “దైవదూతలు జ్ఞానం ఆర్జించే వ్యక్తి పట్ల ప్రసన్నులై తమ రెక్కల్ని పరుస్తారు" అని చెప్పారు. నేను ఆయనతో "మల మూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై మసాహ్ చేసే విషయంలో నాకు సందేహముంది. తమరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు కదా! అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి బోధిస్తుండగా మీరేమైనా విన్నారేమో అడుగుదామని వచ్చాను” అని విన్నవించుకున్నాను. దానికి ఆయన "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన మరియు నిద్ర కారణంగా మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు, అని వివరించారు. ఆ తరువాత నేను “మరి ప్రేమ (అభిమానం) గురించి ఆయన ఏమైనా ప్రబోధిస్తుండగా మీరు విన్నారా?” అనడిగాను. దానికి కూడా ఆయన “అవును, ఒకానొక ప్రయాణంలో మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఆయన దగ్గరే ఉన్నాము. అప్పుడు పల్లెటూరి వ్యక్తి ఒకడు ‘ఓ ముహమ్మద్!' అని బిగ్గరగా అరిచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతే స్వరంతో “ఇక్కడున్నాను" అని బదులు పలికారు. మేము అతనికి, “నీ ధోరణి కడు శోచనీయం. కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉన్నావు. ఆయన సమక్షంలో నువ్విలా బిగ్గరగా మాట్లాడటం నిషిద్ధం” అని హితవు పలికాము. కాని అతను "దైవసాక్షి! నేను తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి “మనిషి కొందరిని ప్రేమిస్తాడు, కానీ వారిని కలుసుకోలేకపోతాడు” అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను ప్రేమించిన వారితో పాటే ఉంటాడు” అని చెప్పారు. తరువాత ఆయన మాతో మాట్లాడుతూ పడమటి దిక్కున ఉన్న ఓ ద్వారాన్ని గురించి ప్రస్తావించారు. దాని వెడల్పు నలభై లేక డెభ్భై సంవత్సరాల ప్రయాణమంత ఉంటుంది లేదా దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog Kurdî Русский دری Português Македонски Tiếng Việt Magyar ქართული Hausa ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Kiswahili ગુજરાતી ភាសាខ្មែរ සිංහල मराठी മലയാളം ಕನ್ನಡ Српскиالشرح
జర్ర్ బిన్ హుబైష్, సఫ్వాన్ బిన్ అస్సాల్ రదియల్లాహు అన్హు వద్దకు మేజోళ్లపై మసాహ్ గురించి అడగడానికి వచ్చారు. అప్పుడు సఫ్వాన్ అడిగారు: ఓ జర్ర్, ఏ విషయం నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది? దానికి జర్ర్ ఇలా బదులిచ్చారు: జ్ఞానాన్వేషణ. అప్పుడు ఆయన అన్నారు: నిశ్చయంగా, జ్ఞాన విద్యార్థి చేసే దాని పట్ల సంతోషం మరియు గౌరవంతో దైవదూతలు తమ రెక్కలను పరుస్తారు. అప్పుడు జర్ర్ అన్నారు: మలమూత్ర విసర్జనల తరువాత మేజోళ్లపై మసాహ్ చేసే విషయంలో నా మనస్సులో సందేహం కలిగింది. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని వారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఏమైనా ప్రస్తావించగా మీరు విన్నారా? సఫ్వాన్ అన్నారు: "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు లైంగిక అశుద్ధావస్థ (జనాబత్) ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జనకి, నిద్రించి లేచినందుకు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు." అప్పుడు నేను, "మీరు ప్రేమాభిమానం గురించి ఆయన ఏమైనా ప్రస్తావించగా విన్నారా?" అని అడిగాను. అతను ఇలా అన్నాడు: అవును, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక ప్రయాణంలో ఉన్నాము. మేము ఆయన వద్ద ఉండగా ఒక పల్లెవాసి బిగ్గరగా పిలిచాడు: ఓ ముహమ్మద్! దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అతని స్వరానికి తగ్గట్టుగా హెచ్చు స్వరంతో సమాధానమిచ్చారు: అవుడు మేము అతనితో "ఇలా రా" అన్నాము: ఇంకా ఇలా అన్నాము, "నీకు వినాశం! నీ స్వరం తగ్గించు, ఎందుకంటే నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నావు, ఆయన వద్ద స్వరం పెంచి మాట్లాడటం నిషేధించబడింది."a b 5⅝ అప్పుడు అతను తన మొరటు స్వభావంతో, “అల్లాహ్ సాక్షిగా! నేను నా స్వరాన్ని తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి, “ఓ రసూలుల్లాహ్! ఒక వ్యక్తి సత్పురుషులను ప్రేమిస్తాడు, కానీ వారిలాంటి కర్మలు చేయలేడు. మరి అతడి సంగతి ఏమిటి?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను అభిమానించిన వారితోపాటే ఉంటాడు” అని చెప్పారు. జిర్ర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆ తరువాత సఫ్వాన్ మాతో మాట్లాడుతూ, సిరియా వైపు ఉన్న పశ్చాత్తాప ద్వారం (బాబ్ లిల్ తౌబహ్) గురించి ప్రస్తావించారు. అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన రోజే దానిని కూడా సృష్టించాడు. దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు. సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు అది మూసుకోదు.فوائد الحديث
జ్ఞానాన్ని అభ్యసించడం యొక్క ఘనత, జ్ఞాన విద్యార్థి యొక్క స్థానం యొక్క గొప్పదనం, మరియు దైవదూతలు అతనిని సత్కరించడం గురించి తెలుస్తున్నది.
తాబయీన్లకు సహాబాల (రదియల్లాహు అన్హుమ్) నుండి విద్యను అభ్యసించడం పట్ల గల ఆశక్తి ఎలాంటిదో తెలుస్తుంది.
ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయడం అనుమతించబడినది, మరియు దాని గడువు: ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు, మరియు నివాసి కొరకు ఒక పగలు మరియు ఒక రాత్రి.
ఖుఫ్ఫైన్ పై మసహ్ చిన్న హదథ్ స్థితిలో మాత్రమే చేయబడుతుంది.
ప్రశ్నించేవాడు విద్వాంసుడిని అతని ఆధారం గురించి - అది ‘నస్’ (మూల ప్రమాణం) అయినా లేదా అతని పరిశోధన మరియు ఇజ్తిహాద్ అయినా - అడగడం అనుమతించదగిన విషయమే. మరియు దీని గురించి ఆ విద్వాంసుడు ఏ మాత్రం సంకోచించకూడదు.
విద్వాంసులు, సత్పురుషుల పట్ల మర్యాదగా నడుచుకోవడం, జ్ఞాన సభలలో స్వరాన్ని తగ్గించడం గురించి తెలుస్తున్నది.
అజ్ఞానికి మంచి మర్యాదలను, ప్రవర్తనా నియమాలను బోధించడం గురించి తెలుస్తున్నది.
సహనము, సత్ప్రవర్తన, మరియు ప్రజల జ్ఞాన, బుద్ధి స్థాయిలకు అనుగుణంగా వారితో సంభాషించే విధానములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుని, దానిని అనుసరించాలనే హితబోధ ఉన్నది.
ముబారక్‌పూరి ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వరాన్ని పెంచింది కేవలం అతనిపై ఉన్న కరుణతో మాత్రమే. అల్లాహ్ తఆలా యొక్క 'ప్రవక్త స్వరం కన్నా మీ స్వరాలను పెంచకండి' అనే ఆజ్ఞ కారణంగా అతని కర్మలు వ్యర్థం కాకూడదని ఆయన అలా చేశారు. అందుకే ప్రవక్త అతని అజ్ఞానాన్ని మన్నించారు. మరియు అతనిపై ఉన్న అత్యధిక వాత్సల్యం కారణంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వరాన్ని అతని స్వరమంత లేదా దానికంటే ఎక్కువగా పెంచారు.
ధార్మికుల సాంగత్యములో కూర్చోవడం, వారికి దగ్గరగా ఉండడం మరియు వారిని ప్రేమించడం పట్ల ఆసక్తిని కనబరచడం.
ఇమాం అన్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అతను (పరలోకంలో) వారితో పాటు ఉన్నంత మాత్రాన, అతని స్థాయి మరియు ప్రతిఫలం అన్ని విధాలుగా వారిలాగే ఉంటుందని దీని అర్థం కాదు.
ఆశ మరియు నమ్మకం యొక్క ద్వారం తెరవడం, విమోచన శుభవార్తను అందించడం మరియు ఉపదేశంలో సౌమ్యతను పాటించడం గురించి తెలుస్తున్నది.
సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, మరియు ఆయన పశ్చాత్తాప ద్వారాన్ని తెరచి ఉంచుట గురించి తెలుస్తున్నది.
తౌబా చేయడంలో త్వరపడాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని మరియు అల్లాహ్ తఆలా వైపుకు మరలాలని ప్రోత్సహించబడింది.
