మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి…

మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి ప్రవేశిస్తాడు.

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి ప్రవేశిస్తాడు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ఎవరైనా అలసట లేదా కడుపు నిండా భుజించుట వంటి కారణాల వలన ఆవలిస్తే, తన చేతిని నోటిపై అడ్డంగా పెట్టి, దాన్ని మూసుకోవాలి. ఎందుకంటే, నోటిని తెరిచి ఉంచితే షైతాన్ అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి, చేతిని నోటిపై పెట్టడం ద్వారా షైతాన్ నోటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.

فوائد الحديث

ఒక వ్యక్తికి ఆవలింత వస్తే, అతడు ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు దాన్ని ఆపడానికి ప్రయత్నించాలి - అంటే, నోటిని బిగించి, మూసి ఉంచాలి, నోరు తెరవకుండా చూడాలి. ఒకవేళ అలా చేయడం సాధ్యం కాకపోతే, తన చేతిని నోటిపై పెట్టాలి - అంటే, నోటిని చేతితో కప్పాలి.

ప్రతి పరిస్థితిలోనూ ఇస్లామీయ ఆచారాలను (ఆదాబ్) పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇవే మన సంపూర్ణతకు (పరిపూర్ణతకు) మరియు మంచి నైతిక విలువలకు (సద్గుణాలకు) గుర్తుగా ఉంటాయి.

షైతాన్ మనుషులపై ప్రభావం చూపే అన్ని మార్గాల నుండి జాగ్రత్త పడాలి.

التصنيفات

తుమ్మే,మరియు ఆవులించే పద్దతులు