.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీ కంటే క్రింద ఉన్నవారిని చూడండి; మీ కంటే పైన ఉన్నవారిని చూడకండి. అలా చేయడం వల్ల అల్లాహ్ మీకు ప్రసాదించి అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ కంటే స్థితి, సంపద, గౌరవం వంటి విషయాల్లో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడాలని, తమ కంటే పై స్థాయిలో ఉన్నవారిని లేదా ప్రపంచ విషయాల్లో మెరుగ్గా ఉన్నవారిని చూడకూడదని ఆదేశించారు. ఇలా చేయడం వలన, మనం అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటాము. అసంతృప్తి, అసూయ లాంటి భావనలు దూరమవుతాయి, మనలో కృతజ్ఞత, తృప్తి పెరుగుతుంది. (దీని ద్వారా ముస్లింలు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాన్ని గుర్తించి, దాన్ని చిన్నగా చూడకుండా, కృతజ్ఞతతో జీవించగలుగుతారు.)

فوائد الحديث

సంతృప్తి అనేది విశ్వాసుల గొప్ప లక్షణాల్లో ఒకటి. ఇది అల్లాహ్ నిర్ణయంతో (తగ్దీర్ తో) సంతోషంగా ఉండే మానసిక స్థితికి సూచిక.

ఇబ్నె జరీర్ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: ఈ హదీథు అనేక రకాల శుభాలను, మంచి నడవడిని కలిగి ఉన్న సమగ్రమైన హదీథు. ఒక వ్యక్తి, ఈ లోకంలో తనకంటే ఎక్కువ దీవెనలు పొందిన వారిని చూస్తే, అతని మనసు కూడా అలాంటి దీవెనలు కోరుతుంది; దాంతో, అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను తక్కువగా భావించడం మొదలవుతుంది; ఆ వ్యక్తి మరింత సంపాదించాలనే తపనతో, ఇతరులను చేరుకోవాలని లేదా మించిపోవాలని ప్రయత్నిస్తాడు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ స్థితి. కానీ, అతను తన కంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూస్తే, అల్లాహ్ తనకు ప్రసాదించిన అనుగ్రహాలను గుర్తిస్తాడు; ధన్యవాదంతో, వినయంగా ఉంటాడు; తన వద్ద ఉన్నదాన్ని మంచి పనులకు ఉపయోగిస్తాడు.

التصنيفات

మనస్సుల పరిశుద్ధత