రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు.

రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు.

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు.

[దృఢమైనది]

الشرح

ప్రవక్త ﷺ ఈ లోకంలోను, పరలోకంలోను మంచి కోరే సంక్షిప్తమైన, విస్తృతమైన అర్థంతో అర్థించే దుఆలను ఇష్టపడేవారు. ఈ దుఆలలో అల్లాహ్‌ యొక్క స్తుతి (ప్రశంస), మరియు మంచి ప్రయోజనాలకు సంబంధించిన అభ్యర్థనలు ఉండేవి. ప్రయోజనం లేని, సుదీర్ఘమైన దుఆలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వదిలేసేవారు.

فوائد الحديث

తక్కువ పదాలతో, ఎక్కువ శుభాల్ని కలిగించే అర్థాలతో కూడిన దుఆలు చేయడం ఇస్లాం ప్రకారం అభిలషణీయమైనదిగా (ముస్తహబ్) భావించబడుతోంది. ప్రయోజనం తక్కువగా ఉండి, అర్థం క్లిష్టంగా ఉండే, అతి ఆర్భాటమైన కోరికల ప్రదర్శనతో కూడిన దుఆలు చేసే పద్ధతి (దుఆల్లో గాంభీర్యం చూపించే ధోరణి), ప్రవక్త ﷺ విధానానికి వ్యతిరేకము.

రసూలుల్లాహ్‌ ﷺ కు "జవామీయుఅల్-కలిమ్" అనే ప్రత్యేక ప్రావీణ్యత ఇవ్వబడింది. (తక్కువ పదాలతో నిగూఢమైన అర్థాలు గల వచనాలు పలికే భాషా ప్రావీణ్యత)

నిశ్చయంగా ప్రవక్త ﷺ చేసిన దుఆలలో స్థిరమైనవి (హదీథులో వచ్చినవి) – అవి ఎంత సుదీర్ఘంగా ఉన్నా, ఎన్ని ఎక్కువ పదాలు ఉన్నా – అవన్నీ వేడుకో దగినవే, ఎందుకంటే అవన్నీ విశాలమైన అర్థాలతో కూడిన సమగ్రమైన దుఆలే.

التصنيفات

దుఆ పద్దతులు