“హజ్ మరియు ఉమ్రాలను వరుసగా చేయండి, ఎందుకంటే అవి ఇనుము, బంగారం మరియు వెండి నుండి మలినాలను తుడిచిపెట్టినట్లే…

“హజ్ మరియు ఉమ్రాలను వరుసగా చేయండి, ఎందుకంటే అవి ఇనుము, బంగారం మరియు వెండి నుండి మలినాలను తుడిచిపెట్టినట్లే దారిద్ర్యాన్ని మరియు పాపాలను తరిమివేస్తాయి. స్వీకరించబడిన హజ్‌కు స్వర్గం తప్ప వేరే ప్రతిఫలం లేదు.“

అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “హజ్ మరియు ఉమ్రాలను వరుసగా చేయండి, ఎందుకంటే అవి ఇనుము, బంగారం మరియు వెండి నుండి మలినాలను తుడిచిపెట్టినట్లే దారిద్ర్యాన్ని మరియు పాపాలను తరిమివేస్తాయి. స్వీకరించబడిన హజ్‌కు స్వర్గం తప్ప వేరే ప్రతిఫలం లేదు.“

[దృఢమైనది]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలను వీలైనంత వరకు అంతరాయం లేకుండా దగ్గరగా (అంటే రెండింటి మధ్య ఎక్కువ కాలయాపన లేకుండా) ఆచరించాలని ప్రోత్సహించారు. ఎందుకంటే వాటిని ఆచరించడం పేదరికాన్ని మరియు పాపాలను తొలగించే సాధనంగా ఉపయోగపడుతుంది; అలాగే వాటి ప్రభావాన్ని హృదయం పై నుండి తొలగిస్తుంది; ఏ విధంగానైతే కమ్మరి కొలిమి తిత్తులు ఊదడం వల్ల ఇనుము నుండి మలినాలు మరియు ఇతర లోహాలు తొలగిపోతాయో.

فوائد الحديث

ఇందులో హజ్జ్ మరియు ఉమ్రాలను ఆచరించడం యొక్క ఘనత తెలుస్తున్నది, అలాగే వాటిని ఆచరిస్తూ ఉండాలనే ప్రోత్సాహం, హితబోధ ఉన్నది.

హజ్ మరియు ఉమ్రాలను ఆచరిస్తూ ఉండడం సంపదకు మరియు పాప క్షమాపణకు ఒక సాధనం.

అల్-ముబారక్‌ఫూరి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: (‘యంఫయానల్ పఖ్ర్’ - పేదరికాన్ని తొలగించుట): అంటే, అవి(ఉమ్రా మరియు హజ్ ఆచరణలు) దానిని తొలగిస్తాయి; ఇది రెండు రకాల పేదరికాన్ని సూచిస్తుంది – సంపదను సంపాదించడం ద్వారా తొలగించబడే స్పష్టమైన పేదరికం, (ఉమ్రా మరియు హజ్ ల కారణంగా) హృదయాన్ని సుసంపన్నం చేయడం ద్వారా తొలగించబడే అంతర్గత పేదరికం.

التصنيفات

హజ్ మరియు ఉమరాల ఘనత