ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా…

ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా కొరడాతో కొట్టినా, నీవు దానిని అతని కొరకు శుద్ధీకరణగా మరియు కారుణ్యంగా చేయుము

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా కొరడాతో కొట్టినా, నీవు దానిని అతని కొరకు శుద్ధీకరణగా మరియు కారుణ్యంగా చేయుము».

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేశారు: ఓ అల్లాహ్! నేను కేవలం ఒక మానవుడిని. మానవులకు కోపం వచ్చినట్లే నాకూ కోపం వస్తుంది. కనుక నేను ఏ విశ్వాసినైనా బాధపెట్టినా లేదా దూషించినా, శపించినా లేదా నీ కారుణ్యం నుండి దూరం చేయమని ప్రార్థించినా లేదా కొరడాతో కొట్టినా, దానిని అతని కొరకు శుద్ధిగా, నీ సామీప్యంగా, పవిత్రతగా, ప్రాయశ్చిత్తంగా మరియు నీవు అతనిపై కురిపించే కారుణ్యంగా మార్చు.

فوائد الحديث

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సత్ప్రవర్తన గురించి స్పష్టమవుతున్నది.

ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ హదీథ్‌లో తన ఉమ్మత్ పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిపూర్ణ దయా, జాలి, ఆయన ఉత్తమ నైతికత మరియు ఆయన వ్యక్తిత్వపు ఘనత ఉన్నాయి. ఎందుకంటే ఆయన నుండి జరిగిన దానికి ప్రతిగా దానిని సరిదిద్ది, గౌరవించాలని ఆయన ఉద్దేశించారు.”

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒకవేళ ఇలా ప్రశ్నిస్తే: శపించబడటానికి లేదా తిట్టబడటానికి అర్హత లేని వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా దుఆ చేస్తారు లేదా అతన్ని ఎలా శపిస్తారు లేదా తిడతారు? దీనికి ఉలమాలు ఇచ్చిన సమాధానమే జవాబు మరియు దాని సారాంశం రెండు విధాలుగా ఉంది: మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ దృష్టిలో మరియు వాస్తవానికి (అంతర్గతంగా) అతను దానికి అర్హుడు కాడు, కానీ బాహ్యంగా చూస్తే అతను దానికి అర్హుడిగానే కనిపిస్తాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు షరియత్ పరమైన సూచనల ఆధారంగా అతను దానికి అర్హుడని అనిపిస్తుంది, కానీ అంతర్గతంగా అతను దానికి అర్హుడు కాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాహ్యంగా కనిపించే దాని ఆధారంగా తీర్పు ఇవ్వమని ఆజ్ఞాపించబడ్డారు, మరియు అల్లాహ్ రహస్యాలను (హృదయాలలోని విషయాలను) చూసుకుంటాడు. రెండవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెలువడిన తిట్లు, శాపనార్థాలు మరియు అలాంటివి ఉద్దేశపూర్వకమైనవి కావు. బదులుగా, అవి అరబ్బుల సంభాషణలో ఎలాంటి దురుద్దేశ్యం లేకుండా మాటల మధ్యలో వాడే ఒక అలవాటు అంటే ఊతపదాలు మాత్రమే. ఉదాహరణకు: ‘తరిబత్ యమీనుక్’, ‘అఖ్రా హల్ఖా’, మరియు ఈ హదీథులో వచ్చినట్లుగా: (లా కబ్బరత్ సిన్నుక), మరియు ముఆవియా రదియల్లాహు అన్హు హదీథులో వచ్చినట్లుగా: లా అష్బఅల్లాహు బత్నక, వంటివి. ఈ మాటల ద్వారా వారు నిజమైన దుఆను ఉద్దేశించరు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ తన నుండి వెలువడిన అలాంటి మాటలు దుఆ స్వీకరించబడే సమయానికి సరిపోతాయేమోనని భయపడ్డారు. అందువలన, ఆయన తన ప్రభువైన పరమ పవిత్రుడు అల్లాహ్ ను వేడుకున్నారు మరియు వాటిని కారుణ్యంగా, పాపపరిహారంగా, (అల్లాహ్) సామీప్యం పొందే సాధనంగా, పవిత్రతగా మరియు పుణ్యఫలంగా మార్చమని ప్రార్థించారు. ఇలాంటివి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి చాలా అరుదుగా మరియు అసాధారణమైన సమయాల్లో మాత్రమే సంభవించేవి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీలమైనవారు కాదు, అశ్లీలంగా మాట్లాడేవారు కాదు, ఎక్కువగా శపించేవారు కాదు, మరియు తన స్వయం కోసం ప్రతీకారం తీర్చుకునేవారు కాదు.

التصنيفات

పుట్టుక గుణాలు