“నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏమిటి? నేను ఈ ప్రపంచంలో ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత వెళ్ళిపోయే ఒక రౌతు లాగా…

“నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏమిటి? నేను ఈ ప్రపంచంలో ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత వెళ్ళిపోయే ఒక రౌతు లాగా ఉన్నాను”

‘అబ్దుల్లా ఇబ్నె మసూద్ (రజియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక గడ్డి చాప మీద నిద్రిస్తున్నారు, తరువాత ఆయన లేచారు, ఆ చాప ఆయన ప్రక్కలపై తన గుర్తులు వదిలింది. మేము ఇలా అన్నాము: ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం), మేము మీ కొరకు ఒక పరుపును తీసుకువస్తాము”, అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏమిటి? నేను ఈ ప్రపంచంలో ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత వెళ్ళిపోయే ఒక రౌతు లాగా ఉన్నాను”.

[దృఢమైనది]

الشرح

అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊ ద్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొంటున్నారు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని రెల్లుగడ్డి పుల్లలతొ నేసిన చిన్న చాపపై పడుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిపై నుండి లేచినపుడు ఆ చాప పుల్లల గుర్తులు వారి ప్రక్కలపై వదిలివేయబడి ఉండడాన్ని చూసి మేము ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేము మీ కొరకు ఒక మెత్తని పరుపును తయారు చేసి తీసుకు వస్తాము. అది ఈ రెల్లు గడ్డి చాప కన్నా మీరు పడుకోవడానికి మంచిగా ఉంటుంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: దాని వైపునకు ఆకర్షితుడనై అది కావాలి అనుకునేటంత ప్రేమ, అభిమానము నాకు ఈ ప్రపంచం పట్ల లేవు. ఈ ప్రపంచంలో నా స్థితి మరియు దానిలో నా మనుగడ అనేది ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత దానిని వదిలి వెళ్లిపోయే రౌతు లాంటిది.

فوائد الحديث

ఈ హదీథులో ఇహలోకం పట్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వైరాగ్యము, మరియు ఇహలోకం పట్ల వారి వికర్షణ గురించి మనకు తెలియుచున్నది.

ఈ హదీథు, ఈ ప్రపంచములోని అనివార్యమైన అంశాలను విదిలివేయడాన్ని సూచించదు, కానీ పరలోకాన్ని పణంగా పెట్టి ఇహలోక జీవితం లో నిమగ్నమైపోయి ఉండడాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి ఒక చెట్టు కింద ఆశ్రయం పొందాడు మరియు తన లక్ష్యాన్ని సాధించడానికి దాని నుండి ప్రయోజనం పొందాడు, కానీ దానిపై ఆధారపడలేదు.

ఇక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హోదా పరిగణనలోకి తీసుకోదగినది, ఎందుకంటే ఆయన ఒక రోల్ మోడల్ మరియు మంచి ఉదాహరణ, మరియు ఆయన అడుగుజాడలను అనుసరించే వారు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మార్గనిర్దేశం చేయబడతారు మరియు విజయం సాధిస్తారు.

ఇందులో రసులుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల సహచరుల (రదియల్లాహు అన్హుమ్) శ్రద్ధ, ఆయనపట్ల వారి ప్రేమ స్పష్టంగా గమనించవచ్చు.

దావహ్ పనిలోనూ (అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుచుట) మరియు విద్యా బోధనలోనూ ఉదాహరణలను, ఉపమానాలను ఉపయోగించ వచ్చును, అందుకు అనుమతి ఉంది.

التصنيفات

ఇహలోక ఇష్టత ఖండన, మనస్సుల పరిశుద్ధత