ఇహలోక ఇష్టత ఖండన

ఇహలోక ఇష్టత ఖండన

3- “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్’పై కూర్చుని ఉన్నారు. మేమంతా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చుని ఉన్నాము, అపుడు వారు ఇలా అన్నారు: @“నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ”*. ఒక వ్యక్తి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఏమీ, మంచి చెడును తీసుకు వస్తుందా?” అని ప్రశ్నించాడు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోయారు. అక్కడున్నవారు అతడిని “ఏమైంది నీకు? నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతావా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడుతున్నది నీతో కాదు కదా?” అని మందలించారు. అయితే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదో అవతరిస్తున్నట్లుగా గమనించినాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదుటిపై పట్టిన చెమట బిందువులను తుడిచి వేసుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ప్రశ్న అడిగినందుకు అతడిని మెచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మంచి ఎప్పుడూ చెడును పుట్టించదు. నిజానికి అది నీటి ప్రవాహం ఒడ్డున పెరిగే ఒక రకం పచ్చిక లాంటిది, అది జంతువులను చంపుతుంది లేదా అనారోగ్యానికి గురి చేస్తుంది, ఒక జంతువు ఖదీరా (ఒక రకమైన కూరగాయ) తిని, ఆపై సూర్యుని వైపు తిరిగి, మలవిసర్జన చేసి, మూత్ర విసర్జన చేసి, మళ్ళీ మేస్తుంది తప్ప (తినేసి అలాగే ఉండిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోదు). నిస్సందేహంగా ఈ సంపద మధురమైనది, పచ్చగా (ఆకర్షణీయంగా) ఉంటుంది. అయితే తన సంపదలో నుండి పేదవారికి, అనాథలకు, అన్నీ కోల్పోయిన ప్రయాణీకులకు దానం చేసేవాని సంపద ధన్యమైనది." లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఇలా అన్నారు: “నిస్సందేహంగా, దానిని (సంపదను) ధర్మవిరుద్ధంగా సంపాదించేవాడు ఎంత తిన్నప్పటికీ సంతృప్తి చెందని వానిలాంటి వాడు. మరియు అతని సంపద పునరుత్థాన దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా మారుతుంది.”