إعدادات العرض
“ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”
“ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Hausa Kurdî தமிழ் Magyar ქართული Kiswahili Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ ગુજરાતી Nederlands Македонски ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: విశ్వాసికి ఈ ప్రాపంచిక జీవితం జైలు లాంటిది, ఎందుకంటే అతడు షరియత్’లో ఆదేశించబడిన వాటిని చేయడం మరియు నిషేధించబడిన వాటిని నివారించడం, వాటి నుండి దూరంగా ఉండడం అనే ధార్మికపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉంటాడు. అతను మరణించినప్పుడు, దీని నుండి విముక్తి పొంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత ఆనందానికి మరలుతాడు. అవిశ్వాసికి ఈ ప్రపంచం స్వర్గం లాంటిది, ఎందుకంటే అందులో అతను తన మనసు కోరినది చేస్తాడు మరియు తన మనోభావాలు, వాంఛలు, కోరికలు అతనికి ఏమి ఆజ్ఞాపిస్తాయో అది చేస్తాడు. అతను మరణించినప్పుడు, పునరుత్థాన దినమున సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత నరక శిక్షలోనికి విసిరి వేయబడతాడు.فوائد الحديث
ఇమాం అన్-నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఖైదు చేయబడ్డాడు, ఎందుకంటే అతను షరియతు నిషేధించిన విషయాల నుండి అసహ్యకరమైన, అశ్లీలమైన కోరికల నుండి, అప్రియమైన ఆచరణల నుండి నిషేధించబడినాడు మరియు కష్టతరమైన విధేయతా చర్యలను ఆచరించే బాధ్యత అతనిపై ఉన్నది. అతను మరణించినప్పుడు, అతను వాటన్నిటి నుండి విముక్తి పొంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన దానికి – అంటే శాశ్వత ఆనందానికి మరియు పరిపూర్ణ సౌకర్యానికి - ఎటువంటి కొరత లేకుండా పరివర్తన చెందుతాడు. ఇక, అవిశ్వాసి విషయానికొస్తే, ఈ ప్రపంచంలో అతను అనుభవించిన ఆనందమంతా పరిమితమైనది మరియు అలజడి, గందరగోళాలతో నిండి ఉంటుంది. అతను మరణించినప్పుడు, అతను శాశ్వత శిక్షకు మరియు శాశ్వత దుఃఖానికి చేరుకుంటాడు.
అస్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన "ఈ ప్రపంచం విశ్వాసికి జైలు వంటిది" అంటే దాని అర్థము విశ్వాసి ఒకవేళ ఈ ప్రపంచములో సుఖంగా, సౌకర్యవంతంగా జీవిస్తున్నప్పటికీ, స్వర్గం అతనికి ఈ ప్రపంచం కంటే మెరుగైనది అని; మరియు "అవిశ్వాసికి ఈ ప్రపంచం స్వర్గం వంటిది" అంటే అతను ఒకవేళ ఈ ప్రపంచములో కష్టాల్లో ఉండి ఉన్నప్పటికీ, నరకాగ్ని అతనికి ఈ ప్రపంచం కంటే దారుణమైనది అని.
సర్వోన్నతుడైన అల్లాహ్ ముందు ఈ ప్రపంచము అత్యల్పమైనది.
విశ్వాసులైన ప్రజలకు ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలము వంటిది.
అవిశ్వాసి ఇహలోక జీవితంలో తన స్వర్గాన్ని త్వరగా పొందుతాడు, మరియు పరలోక జీవితములో అతనికి స్వర్గం మరియు పరలోక సుఖాలు లేకుండా శిక్షించబడతాడు.
