“సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును

“సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు: “సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును.

[ప్రామాణికమైనది]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణాన్ని తరచుగా స్మరించుకోవాలని కోరారు, ఇది ఒక వ్యక్తికి పరలోకాన్ని గుర్తు చేస్తుంది మరియు ప్రాపంచిక సుఖాల పట్ల, ముఖ్యంగా నిషేధించబడిన వాటి పట్ల అతని ప్రేమను నాశనం చేస్తుంది.

فوائد الحديث

మరణం ఈ లోక సుఖాలను నిలిపివేస్తుంది. కానీ విశ్వాసి విషయానికొస్తే, అది అతన్ని పరలోక సుఖాలకు, స్వర్గ సుఖాలకు మరియు అక్కడ అతని కొరకు ఎదురుచూసే గొప్ప శుభాలకు తీసుకెళుతుంది..

మరణాన్ని మరియు దాని తర్వాత వచ్చే వాటిని గుర్తు చేసుకోవడం అనేది (పాపాల పట్ల) పశ్చాత్తాపానికి, సంయమనంతో జీవించడానికి, మరియు పరలోకానికి సిద్ధపడటానికి ఒక కారణం అవుతుంది.

التصنيفات

ఇహలోక ఇష్టత ఖండన