إعدادات العرض
“ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు
“ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు. ఆదము సంతానం యొక్క కడుపును ధూళి (మట్టి) తప్ప మరేమీ నింపదు, మరియు అల్లాహ్ పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Indonesia Türkçe اردو 中文 हिन्दी Français Kurdî Русский Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Hausa Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ ગુજરાતી Nederlands Македонски Tagalog ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡ မြန်မာ پښتوالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక మానవుడికి బంగారంతో నిండిన లోయ ఉంటే, అతనిలో సహజంగా ఉండే దురాశ కారణంగా, అతను మరో రెండు లోయలు కావాలని కోరుకుంటాడు. అతను చనిపోయే వరకు మరియు అతని కడుపు అతని సమాధి దుమ్ముతో నిండిపోయే వరకు ఈ ప్రపంచం కోసం దురాశ పడుతూనే ఉంటాడు.فوائد الحديث
ఈ హదీథు సంపద మరియు ఇతర ప్రాపంచిక సుఖాలను కూడబెట్టుకోవాలనే మానవుడి తీవ్రమైన కోరికను తెలియజేస్తున్నది.
ఇమాం అన్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఈ హదీథు ప్రాపంచిక వస్తువులపై దురాశను, వాటిని కూడబెట్టుకోవాలనే కోరికను మరియు వాటిపై వాంఛను ఖండిస్తున్నది.
ఖండించదగిన లక్షణాల నుండి పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అంగీకరిస్తాడు.
ఇమాం అన్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ హదీథు ప్రాపంచిక విషయాల పట్ల మనుషులలో ప్రబలంగా ఉండే కోరికను సూచిస్తున్నది, ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క "మరియు దేవుడు పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు – అనే వాక్యము ద్వారా ధృవీకరించబడింది."
