“మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు…

“మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు (జఘన వెంట్రుకలు) గీసుకోవడం గురించి మాకు ఒక సమయ పరిమితి విధించబడింది - మేము వాటిని నలభై రాత్రులకు మించి వదిలివేయరాదు.”

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు (జఘన వెంట్రుకలు) గీసుకోవడం గురించి మాకు ఒక సమయ పరిమితి విధించబడింది - మేము వాటిని నలభై రాత్రులకు మించి వదిలివేయరాదు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – మీసాలు కత్తిరించుకోవడానికి, చేతి మరియు కాలి వేళ్ళ గోళ్ళు కత్తిరించుకోవడానికి, చంకల క్రింది వెంట్రుకలు తీసివేయడానికి మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలను (జఘన వెంట్రుకలను) తొలగించుకోవడానికి – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 40 దినముల కాలపరిమితిని విధించారు అని ఈ హదీథు ద్వారా మనకు తెలుస్తున్నది.

فوائد الحديث

ఇమాం షౌకానీ ఇలా అన్నారు: పైన తెలిపిన పనులు (మీసాలు కత్తిరించుకోవడం మొదలైనవి) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిర్దేశించిన నలభై రోజుల గడువు లోపు జరగాలి అనే అభిప్రాయం ధర్మ పండితుల నడుమ ప్రాధాన్యత కలిగిన అభిప్రాయము. అయితే వెంట్రుకలు, గోళ్ళు మొదలైనవి పెరిగిన తరువాత వాటిని కత్తిరించకుండా, తొలగించకుండా ఎవరైనా ఆలాగే ఉంచినట్లైతే, ఆ విధించిన కాలపరిమితి దాటనంత వరకు అతడు సున్నత్’ను వ్యతిరేకిస్తున్నవాడిగా పరిగణించబడడు.

ఇబ్నె హుబైరా ఇలా అన్నారు: ఈ హదీథ్ ఈ విషయాలను ఆలస్యం చేయడానికి విధించబడిన గరిష్ట పరిమితిని సూచిస్తుంది. ఈ పరిమితిని చేరుకునే ముందుగానే ఈ విషయాలను గమనించి వాటిపట్ల శ్రధ్ధ వహించడం మంచిది.

ఇస్లాం పరిశుభ్రత, శుద్ధీకరణ మరియు సౌందర్యంగా ఉండడాన్ని నొక్కి చెబుతుంది.

మీసాలను కత్తిరించడం అనేది పై పెదవిపై పెరిగే కొన్ని వెంట్రుకలను తొలగించడం ద్వారా జరుగుతుంది.

చంక వెంట్రుకలను తీయడం అంటే అక్కడ పెరిగే వెంట్రుకలను తొలగించడం, ఇది చేయిని భుజానికి కలిపే కీలు కింద ఉన్న ప్రాంతం.

‘జఘన వెంట్రుకలను తొలగించడం’ అంటే, స్త్రీలు మరియు పురుషులకు వారి మర్మాంగాల చుట్టూ పెరిగే ముతకగా ఉండే వెంట్రుకలను తొలగించడం.

التصنيفات

ప్రకృతి మార్గాలు