إعدادات العرض
చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి
చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి
సహల్ ఇబ్నె సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి. చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili Hausa සිංහල English ગુજરાતી Magyar ქართული Română Русский Português ไทย मराठी دری Türkçe አማርኛ বাংলা Kurdî Malagasyالشرح
చిన్న చిన్న పాపాలు చేయడంలో మెతకదనం చూపవద్దని, వాటిని తరచుగా చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఎందుకంటే అవన్నీ నాశనానికి దారితీస్తాయి. ఒక లోయలో విడిది చేసిన వ్యక్తుల ఉదాహరణను ఆయన ఇచ్చారు. అక్కడి ప్రతి ఒక్కరూ ఒక చిన్న కట్టెను తీసుకు వచ్చారు, అలా వారు ఆ కట్టెలను తమ రొట్టెలు కాల్చేందుకు అవసరమైనంతగా జమ చేసి పెద్ద మంట రాజేసినారు. అలాగే చిన్న చిన్న పాపాలు చేసిన వ్యక్తి వాటిలో చిక్కుకోకుండా, వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప పడకపోతే, అల్లాహ్ అతడిని క్షమించకపోతే, అవన్నీ అతడిని నాశనం చేస్తాయి.فوائد الحديث
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉపదేశంలో ఉదాహరణలు (ఉపమానాలు, దృశ్యాలు) ఇవ్వడం ద్వారా విషయాన్ని సులభంగా అర్థం అయ్యేలా, ఇంకా స్పష్టంగా వివరించేందుకు ప్రయత్నించినారు.
చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకూడదని హెచ్చరిక, అలాగే, వాటిని వెంటనే పరిహరించేందుకు (తౌబా చేయడంలో) త్వరపడాలని ప్రోత్సాహం.
"చిన్న చిన్న పాపాలు" (ముహక్కిరాత్ అద్ధునూబ్) అనేవి మూడు అర్థాలు కలిగి ఉంటాయి: 1. ఒకవేళ ఎవరైనా ఏదైనా పాపం చేస్తూ, అది చిన్నదేనని భావిస్తే, అది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపం కావచ్చు. 2. ఎవరైనా నిజంగా చిన్న పాపాలు చేస్తూ, వాటిని నిర్లక్ష్యం చేస్తూ, తౌబా చేయకుండా ఉండటం వలన — ఆ చిన్న పాపాలు పోగవుతూ, చివరకు అతన్ని నాశనం చేస్తాయి. 3. ఎవరైనా చిన్న పాపాలను నిర్లక్ష్యం చేస్తూ, వాటిని పట్టించుకోకుండా ఉంటే, ఆ అలవాటు అతన్ని పెద్ద పాపాల్లో పడేసే ప్రమాదం ఉంది.
التصنيفات
పాపకార్యముల ఖండన