“నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఎదురుగా నడిచి వెళ్ళుచున్న వ్యక్తికి తాను చేస్తున్నది ఎంత పెద్ద అపరాధమో…

“నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఎదురుగా నడిచి వెళ్ళుచున్న వ్యక్తికి తాను చేస్తున్నది ఎంత పెద్ద అపరాధమో తెలిస్తే, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే, అతడు నలభై వరకు అక్కడే నిలబడి ఉండడానికి ఇష్టపడతాడు, తప్ప అతని ముందు నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టపడడు”

బుస్ర్ ఇబ్న్ సఈద్, తనను జైద్ ఇబ్న్ ఖాలిద్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు 'నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళే వ్యక్తికి సంబంధించి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమి విన్నారో తెలుసుకుని రమ్మని' అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు వద్దకు పంపినారు అని తెలిపినారు; అపుడు అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఎదురుగా నడిచి వెళ్ళుచున్న వ్యక్తికి తాను చేస్తున్నది ఎంత పెద్ద అపరాధమో తెలిస్తే, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే, అతడు నలభై వరకు అక్కడే నిలబడి ఉండడానికి ఇష్టపడతాడు, తప్ప అతని ముందు నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టపడడు”. అబూ అన్’నద్ర్ ఇలా అన్నారు: “అతడు నలభై రోజులు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా చెప్పలేను.”

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

ఫర్జ్ లేదా నఫీల్ నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళరాదు అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉద్దేశపూర్వకంగా అలా చేసిన వ్యక్తి, దాని వలన తనకు కలిగే పాపం ఏమిటో తెలిస్తే, అతను నలభై అయినా అక్కడే నిలబడి ఉండడాన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే అది ఆ నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే అతనికి మంచిది”. ఈ హదీథు ఉల్లేఖకర్త అయిన అబూ నద్ర్ ఇలా అన్నారు: “ఆయన నలభై దినములు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా నాకు తెలియదు.”

فوائد الحديث

నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు ‘సుత్రహ్’ ఏమీ లేనట్లయితే, అతని ముందు నుంచి నడిచి వెళ్ళడం నిషిద్ధము; ఒకవేళ అతని ముందు సుత్రహ్ ఉన్నట్లయితే, అతనికి మరియు అతని ముందున్న ‘సుత్రహ్’ కి మధ్య నుండి నడిచి వెళ్ళడం నిషిద్ధము.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ నిషేధం యొక్క నిర్దిష్ట పరిమితికి సంబంధించి ఉలమాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు: “ఎవరైనా నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి మరియు అతను సజ్దహ్ చేసే ప్రాంతం మధ్య నడిచి వెళితే ఈ నిషేధం వర్తిస్తుంది” అని అభిప్రాయ పడినారు. మరి కొందరు: “నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు మూడు మూరల దూరం లోపల నడిచి వెళితే ఈ నిషేధం వర్తిస్తుంది” అని అభిప్రాయపడినారు. మరి కొందరు: “నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి మరియు (అక్కడి నుండి) ఒక రాయి విసిరితే అది ఎంత దూరం వెళుతుందో ఆ దూరం మధ్యన నడిచి వెళితే ఈ నిషేధం వర్తిస్తుంది” అని అభిప్రాయ పడినారు”.

ఇమామ్ అస్’సుయూతీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్ళడం” అంటే దాని అర్థము అతని ముందు అతనికి అడ్డంగా నడిచి వెళ్ళడం. అలాగాక అతనికి ఎదుటి వైపు, ఖిబ్లాహ్ దిశలో ముందుకు నడిచి వెళ్ళే వ్యక్తి ఈ నిషేధం పరిధిలోనికి రాడు.”

నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాలలో లేదా ప్రజలు నడిచే ప్రదేశాలలో నమాజు ఆచరించకుండా ఉండుట మంచిది, తద్వారా తన నమాజులో లోపం చోటు చేసుకోకుండా చూసుకోగలడు లేదా బాటసారులను పాపానికి గురి కాకుండా చూడగలడు. అలాగే అతడు తనకు మరియు తన ముందు వెళ్ళేవారికి మధ్య అడ్డుగా ఒక ‘సుత్రాహ్’ను (అవరోధాన్ని) కూడా ఏర్పరచుకోవాలి.

దీని నుండి అర్థమవుతున్న విషయం ఏమిటంటే, అవిధేయత వల్ల పరలోకంలో కలిగే అతి చిన్న పాపమైనా సరే, అది ఈ ప్రపంచములో కలిగే ఎంతో తీవ్రమైన కష్టము కంటే చాలా పెద్దది, కష్టతరమైనది మరియు చాలా తీవ్రమైనది.

التصنيفات

నమాజ్ సున్నత్ లు