నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన…

నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: "నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: “స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని కింద వేగంగా పరుగెత్తే గుర్రంపై ప్రయాణించే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా కూడా, దాని చివరి కొమ్మను చేరుకోలేడు.”.

فوائد الحديث

ఈ హదీథులో స్వర్గం యొక్క విశాలత మరియు దానిలోని వృక్షముల పరిమాణం యొక్క వివరణ ఉన్నది.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు