“నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట…

“నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది"

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది"

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

నమాజు ఆచరిస్తున్నపుడు లేదా ఇతరత్రా దుఆ చేసేటప్పుడు ఆకాశం వైపు చూసేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. అలా చేసే వారిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన మందలింపును, హెచ్చరికను తీవ్రతరం చేసినారు – వారి చూపు ఎంత త్వరగా లాగుకోబడుతుందంటే, వారు చూపు అనే భాగ్యాన్ని కోల్పోయే వరకు దానిని గ్రహించలేరు అని తనకు భయంగా ఉంది అని అన్నారు.

فوائد الحديث

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దావా చేయడంలో (వ్యక్తులను సంస్మరించడానికి) అనుసరించిన విధానం యొక్క గొప్పతనం, మరియు సత్యాన్ని స్పష్టం చేయడం మనకు కనిపిస్తున్నాయి. లక్ష్యం సత్యాన్ని స్పష్టం చేయడమే, కనుక తప్పు చేసిన వ్యక్తిని ఆయన బయట పెట్టలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తప్పు చేసిన వారెవరో ఇతరులకు తెలియకుండా దాచినందున, ఆయన ఇచ్చిన సందేశాన్ని వారు అంగీకరించే అవకాశం ఎక్కువ.

నమాజు ఆచరిస్తున్న సమయంలో ఆకాశం వైపు చూపులు ఎత్తే వారి కొరకు ఇది కఠినమైన నిషేధం మరియు తీవ్రమైన హెచ్చరిక.

'ఔనుల్-మఅ్’బూద్' లో ఇలా పేర్కొనబడినది: “దీనికి కారణం ఏమిటంటే, ఎవరైనా ఆకాశం వైపు చూస్తే, వారు ఖిబ్లా దిశ నుండి వైదొలగిన వారవుతారు, మరియు ఖిబ్లా నుండి వైదొలగడమే కాకుండా నమాజు యొక్క పద్ధతి నుండి దూరంగా వెళ్ళిపోయిన వారవుతారు.”

నమాజులో కళ్ళు ఆకాశం వైపునకు ఎత్తడం నమాజులో అవసరమైన వినయం మరియు ఏకాగ్రతకు విరుద్ధమైన విషయం.

ఈ హదీథులో నమాజు యొక్క గొప్ప ప్రాముఖ్యత తెలుస్తున్నది, మరియు ప్రార్థన చేసేవాడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సమక్షములో పూర్తి గౌరవం మరియు సరైన నడతను పాటించాలి అని తెలుస్తున్నది.

التصنيفات

నమాజ్ చదివే వారి తప్పిదాలు