.

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: "ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.' "అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, "కావాలంటే మీరు పవిత్ర గ్రంథాన్ని పఠించండి, “ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా” (నిష్చయంగా తెల్లవారుజామున ఖురాన్ పారాయణం (ఫజ్ర్ ప్రార్థన) ఎల్లప్పుడూ వీక్షించబడుతుంది." (సూరహ్ అల్ ఇస్రా 17:78).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ఇమామ్‌తో కలిసి సామూహికంగా నమాజు ఆచరించే వ్యక్తికి లభించే ప్రతిఫలం మరియు బహుమానము అతడు ఇంట్లోనో లేదా మార్కెట్‌లోనో ఒంటరిగా ఆచరించే ఇరవై ఐదు నమాజుల కంటే గొప్పదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు. తరువాత ఆయన రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతలు ‘ఫజ్ర్’ నమాజు కోసం సమావేశమవుతారని ప్రస్తావించారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దీనికి ఆధారాలను ఉటంకిస్తూ ఇలా అన్నారు: “కావాలంటే మీరు (ఖుర్’ఆన్) చదండి: {ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా} (నిశ్చయంగా, ప్రాతఃకాల (ఖుర్‌ఆన్‌) పఠనం (దైవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది. [సూరా అల్ ఇస్రా: 17:78] అంటే దాని అర్థము ఫజ్ర్ నమాజు రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతల ద్వారా వీక్షించబడుతుంది అని.

فوائد الحديث

ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “మస్జిదులో ఇమాంతో పాటు జమాఅత్ తో ఆచరించబడే నమాజు ఇంటిలోనో లేక మార్కెట్టు (దుకాణము) లోనో ఆచరించే నమాజు కంటే ఉత్తమమైనది – అది ఒంటరిగా ఆచరించినా లేక సామూహికంగా (జమాఅత్ ఏర్పరిచి) ఆచరించినా. ఈ విషయాన్ని ఇబ్న్ దఖీఖ్ అల్ ఈద్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖించినారు.

ఈ హదీథు ఫజ్ర్ నమాజు యొక్క ప్రత్యేకతను, ఘనతను సూచిస్తున్నది, కారణం దైవదూతలు ఫజ్ర్ నమాజులో ప్రత్యేకించి సమావేశమవుతారు.

షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ ఈ గొప్ప మేలును, ప్రతిఫలాన్ని పొందడానికి ప్రతివిశ్వాసి నమాజును మస్జిదులో ఇమాంతో జమాఅత్ తో ఆచరించడానికి కృషిచేయాలి – అతడి ఇల్లు మస్జిదుకు దూరంగా ఉన్నా సరే.

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్), రెండు హదీథుల మధ్య సమన్వయం చేస్తూ, ఒక హదీథులో ఇరవై ఐదు రెట్లు మరియు మరొక కథనంలో ఇరవై ఏడు రెట్లు వ్యక్తిగత నమాజు కంటే సామూహిక నమాజు ఉత్తమమని అన్నారు. వాటి మధ్య సయోధ్యను మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు: 1. ముందుగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ రెండు హదీథుల మధ్య ఎటువంటి వైరుధ్యము లేదు, కారణం తక్కువ సంఖ్యను పేర్కొనడం అనేది పెద్ద సంఖ్యను తిరస్కరించినట్లు కాదు. ఉసూల్ పండితుల (ఇస్లామిక్ న్యాయశాస్త్ర పండితుల) ప్రకారం నిర్దిష్ట సంఖ్య అనే భావన చెల్లదు. 2. బహుశా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట తక్కువ సంఖ్యను ప్రస్తావించి ఉండవచ్చు, తరువాత అల్లాహ్ ఆయనకు సల్లల్లాహు అలైహి వసల్లం) గొప్ప ప్రతిఫలం గురించి తెలియజేసి ఉండవచ్చు, అప్పుడు దానిని ఆయన తెలియజేసి ఉండవచ్చు. 3. ఆరాధకుల పరిస్థితులు మరియు వారి నమాజును బట్టి ప్రతిఫలం మారవచ్చు. కొంతమందికి, ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు కావచ్చు, మరికొందరికి, ఇరవై ఏడు రెట్లు కావచ్చు, ఇది వారి నమాజు యొక్క పరిపూర్ణత, దాని సరైన ఆచరణ విధానానికి కట్టుబడి ఉండటం, వినయం మరియు ఏకాగ్రత, నమాజు ఆచరించే వారి సంఖ్యపై మరియు నమాజు ఆచరించే వారి యోగ్యత, నమాజు ఆచరించే ప్రదేశం ఏమైనా ఘనత కలిగిన ప్రదేశమా అనే విషయం మీద మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వల్లాహు ఆ’లము (అల్లాహ్ యే బాగా ఎరిగిన వాడు).

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు