జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు

1- మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకు ఒక అంధుడు వచ్చి ప్రశ్నించాడు ‘ఓ దైవప్రవక్త:నన్ను మస్జిద్ కు తీసుకుని వెళ్ళడానికి సహాయకులు ఎవరు లేరు,అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను ‘తనకి ఇంట్లో నమాజు చదువుకోవడానికి అనుమతించండి అని వేడుకున్నాడు,ప్రవక్త అతనికి ‘అనుమతిచ్చారు’ఆ వ్యక్తి వెనుతిరిగి వెళ్ళేటప్పుడు అతన్ని పిలిచారు’ఆ పై అడిగారు‘నీకు నమాజు యొక్క అజాన్ వినబడుతుందా?అతను ‘అవును’అని చెప్పాడు,ప్రవక్త ‘అప్పుడైతే దానికి జవాబు చెప్పాల్సి ఉంది అని చెప్పారు.