నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి…

నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నన్ను మస్జిదుకు తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరు” అని, తన ఇంటిలోనే నమాజు ఆచరించుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని వెనుకకు పిలిచి “నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు సహాయం చేయడానికి గానీ, ప్రతిరోజూ ఐదు పూటల నమాజు కొరకు నా చేయి పట్టుకుని మస్జిదునకు తీసుకు వచ్చే వారెవ్వరూ లేరు” అని జమాఅత్ ను వదలడానికి (తన ఇంటిలోనే నమాజు ఆచరించడానికి) ఆయన అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. అతడు వెనుతిరగగా ఆయన అతనితో “సలాహ్ కొరకు ఇవ్వబడే అదాన్ ను నీవు వినగలవా?” అని ప్రశ్నించారు. అతడు “అవును, వినగలను” అని జవాబిచ్చినాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు (అంటే మస్జిదుకు వచ్చి జమాతుతో నమాజు ఆచరించు)” అన్నారు.

فوائد الحديث

ఇందులో నమాజును జమాఅత్ తో ఆచరించుట వాజిబ్ (విధి) అనే విషయం తెలుస్తున్నది. ఎందుకంటే వికల్పము (ఆప్షన్) కేవలం విధిగా ఆచరించవలసిన విషయాలకే ఇవ్వబడుతుంది. (విధిగా ఆచరించవలసిన అవసరం లేని విషయాలకు వికల్పాలు అవసరం లేదు కదా)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం “దానికి (అనుగుణంగా) స్పందించు” అనేది ఎవరైతే అదాన్ వింటారో వారందరికీ జమాఅత్’తో నమాజు ఆచరించుట వాజిబ్ (విధి) అని తెలియజేస్తున్నది. ఎందుకంటే దానికి సంబంధించి అసలు ఆదేశము “విధి” అనే.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు