ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన…

ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఆరాధన కొరకు గానీ, లేక ఙ్ఞానము సంపాదించుకొనుట కొరకు గానీ, లేక ఏవైనా ఇతర మంచి ప్రయోజనాల కొరకు గానీ, దినములో ఏ సమయములోనైనా – అంటే ఉషోదయం సమయాన గానీ, లేక సాయంత్రం సమయాన గానీ మస్జిదును సందర్శించే వాని కొరకు అల్లాహ్ స్వర్గములో ఒక నివాసాన్ని సిధ్ధం చేస్తాడు; ఈ ఘనత పగటిపూట గానీ, లేక రాతి వేళ గాని మస్జిదును సందర్శించిన వారికీ వర్తిస్తుంది. ఈ శుభవార్తను ఈ హదీథు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇస్తున్నారు.

فوائد الحديث

ఈ హదీథులో మస్జిదును సందర్శించుట యొక్క ఘనత, మరియు నమాజులను జమాఅత్’తో కలిసి ఆచరించాలనే ప్రోత్సాహము ఉన్నాయి. ఎవరైతే మస్జిదులను సందర్శించుట నుండి ఎంత దూరంగా ఉంటాడో, మస్జిదులను సందర్శించే వారి కొరకు అల్లాహ్ సిధ్ధం చేసి ఉంచిన మంచి, పుణ్యము, ప్రతిఫలం మరియు అల్లాహ్ యొక్క శుభాలను అంతగా కోల్పోతాడు.

ప్రజలు తమను సందర్శించడానికి తమ ఇంటికి వచ్చే వారితో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు. వారికి ఆహారం వడ్డిస్తారు, వీలయినంత ఎక్కువగా మర్యాదలు చేస్తారు. మరి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుల కంటే కూడా ఎంతో ఉదారమైన వాడు. తన ఇంటికి ఎవరు వచ్చినా ఆయన అతడిని ఔదార్యముతో ఆదరిస్తాడు, మరియు అతనికి గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప నివాసాన్ని సిద్ధం చేస్తాడు.

మస్జిదులను సందర్శించుటలో సంతోషము, ఆనందము ఉన్నాయి. ఎందుకంటే అలా సందర్శించే వానికి ఒక గొప్ప నివాసము సిద్ధం చేయబడుతుంది; అతడు మస్జిదునకు ఎపుడు వెళ్ళినా; అలాగే అతడు ఎన్ని సార్లు మస్జిదును సందర్శిస్తే అన్ని నివాసములు అతని కొరకు సిధ్ధం చేయబడతాయి.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు