“జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో…

“జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం జామాఅత్ తో పాటు సలాహ్ (నమాజు) ఆచరించినట్లయితే అది అతడు తాను ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం) లోనో ఆచరించిన సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది. తరువాత దాని కారణాన్ని ఇలా వివరిస్తున్నారు: అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా మరియు పరిపూర్ణంగా ఉదూ ఆచరిస్తాడు; తరువాత అతడు మస్జిదుకు బయలుదేరుతాడు – కేవలం సలాహ్ ఆచరించే సంకల్పముతో బయలు దేరుతాడు; దానితో అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; ప్రతి అడుగు అతడి నుంచి ఒక పాపాన్ని తొలగిస్తుంది. తరువాత అతడు మస్జిదులోనికి ప్రవేశించి, కూర్చుని సలాహ్ కొరకు ఎదురుచూస్తూ వేచి ఉన్నట్లయితే, అతడు వేచి ఉన్న కాలమంతా అతడు సలాహ్ లోనే గడిపినంత పుణ్యాన్ని పొందుతాడు. అతడు, తాను సలాహ్ ఆచరించి కూర్చుని ఉన్న స్థలం లోనే గడిపినంత కాలం దైవదూతలు అతని కొరకు అల్లాహ్ ను ప్రార్థిస్తూ, ఇలా అంటారు: “ఓ అల్లాహ్! అతడిని క్షమించు (అతడి పాపాలను మన్నించు); ఓ అల్లాహ్! అతడిని కరుణించు; ఓ అల్లాహ్! అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”. ఇలా అతడు తన ఉదూను భంగపరచనంత వరకు, లేదా, ఇతరులకు లేదా దైవదూతలకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంతవరకు ప్రార్థిస్తూ ఉంటారు.

فوائد الحديث

(షరియత్ అంగీకరించే ఏదైనా కారణం వల్ల) ఎవరైనా ఒంటరిగా తన ఇంటిలోనో, లేక తన వ్యాపార స్థలంలోనో సలాహ్ ఆచరించడం అంగీకార యోగ్యమైనదే; అయితే ఏ కారణమూ లేకుండా జామాఅత్ తో సలాహ్ ఆచరించుట వదిలి వేసినట్లయితే అతడు ఘోరమైన పాపానికి ఒడిగట్టినట్లే.

మస్జిదులో జామాఅత్’తో సలాహ్ ఆచరించుట, ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే సలాహ్ కంటే, ఇరవై ఐదు లేక ఇరవైఆరు లేక ఇరవై ఏడు రెట్లు ఉత్తమమైనది.

దైవదూతల కార్యాచరణలో, విశ్వాసుల కొరకు దుఆ చేయుట కూడా ఒకటి అని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది.

ఇంటి నుండే వుజూ చేసి మస్జిదునకు బయలుదేరుట ఉత్తమం.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు