“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా…

“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లి తిన్నాడో అతడు మస్జిదుకు రారాదని నిషేధించినారు - అలా వాటిని తిని, దాని వాసన వస్తున్న నోటితో మస్జిదుకు వచ్చినట్లయితే, జమాఅత్’తో నమాజు చదవడానికి వచ్చిన తన సోదరులను ఇబ్బందికి గురిచేస్తాడు అనే ఉద్దేశ్యంతో. ఈ నిషేధాన్ని ‘తన్’జీహీ’ అంటారు; అంటే ఇది, వాటిని తిని వాసన వచ్చే నోటితో మస్జిదుకు రావడాన్ని మాత్రమే నిషేధిస్తున్నది, వాటిని తినడం నుండి కాదు; ఎందుకంటే అవి ‘హలాల్’ (షరియత్ అనుమతించిన) ఆహారపదార్థాలు. తరువాత కూరగాయలతో కూడిన ఒక కుండను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి తీసుకు రావడం జరిగింది. దాని నుండి వస్తున్న వాసనను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు దానిలో ఏమి ఉన్నదో తెలియజేయడం జరిగింది. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తినడానికి ఇష్టపడలేదు. వారు ఆ కుండను తనతోపాటు ఉన్న సహచరుల వైపునకు పంపినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుకరిస్తూ వారు కూడా దానిని తినడానికి అయిష్టత చూపినారు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు తినండి! ఎందుకంటే నేను వహీ తీసుకుని వచ్చే దైవదూతలతో సంభాషిస్తుంటాను”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు – దుర్వాసన వలన మనుషులకు ఏ విధంగానైతే ఇబ్బంది, హాని కలుగుతుందో, అదేవిధంగా దైవదూతలకు కూడా కలుగుతుంది.

فوائد الحديث

ఇందులో ఎవరైతే పచ్చి వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయలు మరియు పచ్చి ఉల్లి ఆకులు తిన్నారో వారు మస్జిదునకు రావడం పట్ల నిషేధాన్ని చూడవచ్చు.

దేనిని తినడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుందో అంటే ఆ కారణంగా సలాహ్ కొరకు వచ్చిన ముస్లిములకు బాధ ఇబ్బంది కలుగుతుందో, అటువంటి ప్రతి వస్తువూ ఈ కోవలోనికి చేరుతుంది, ఉదాహరణకు పొగత్రాగుట మరియు పొగాకు, జర్దా నములుట మొదలైనవి.

వాటి పట్ల అయిష్టానికి కారణం అవి కలిగించే దుర్వాసన. కనుక వాటిని బాగా ఉడక బెట్టడం ద్వారా, లేక బాగా వండడం ద్వారా వాటి నుండి దుర్వాసన కలిగించే లక్షణం తొలగిపోతే అయిష్టత కూడా తొలగిపోతుంది.

మస్జిదులో జమాఅత్’తో నమాజుకు హాజరు కావలసి ఉన్నవారు వీటిని తిని మస్జిదుకు వెల్లడం ఇష్టమైన చర్య కాదు (మక్రూహ్), కనుక నమాజుకు హాజరు కావలసి ఉన్నవారు వీటిని తినకుండా ఉండాలి. మస్జిదులో నమాజుకు హాజరు కాకుండా ఉండే ఉద్దేశ్యంతో వీటిని తిన్నట్లయితే అది హరాం చర్య అవుతుంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని తినడం నుండి దూరంగా ఉన్నారు; అందుకు కారణం అవి తినడం హరాం (నిషేధం) అని కాదు, ఎందుకంటే వారు సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూత అయిన జిబ్రీల్ (అలైహిస్సలాం) తో సంభాషిస్తూ ఉంటారు కనుక.

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతమైన బోధనా విధానాన్ని గమనించవచ్చు. వారు పచ్చి ఉల్లి, పచ్చి వెల్లుల్లి, పచ్చి ఉల్లి ఆకులు తినరాదు అనే తన తీర్పు వెనుక ఉన్న హేతువును స్పష్ఠం చేయడం ద్వారా వింటున్న వారిలో భరోసాను కలుగజేసారు.

అల్’ఖాజీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ధర్మ పండితులు ఈ విషయం మస్జిదులకు మాత్రమే కాకుండా ఎక్కడైతే ఇబాదత్ (అరాధన) కొరకు ప్రజలు జమ అవుతారో అటువంటి ప్రదేశాలన్నింటికీ వర్తిస్తుంది అన్నారు, ఉదాహరణకు: ఈద్ ప్రార్థనలు జరిగే స్థలాలు (ఈద్’గాహ్ లు మొ.); మృతుని కొరకు ప్రార్థన జరిగే స్థలాలు (సలాతుల్ జనాయిజ్ జరిగే స్థలాలు) మొదలైన ప్రదేశాలు. అదే విధంగా ఙ్ఞానసముపార్జనకు సంబంధించిన సమావేశాలు జరిగే స్థలాలు; అల్లాహ్ యొక్క ‘దిక్ర్’ (స్మరణ) జరిగే స్థలాలు మొదలైనవి. అయితే మార్కెట్ స్థలాలు, సంతలు మరియు అటువంటి ప్రదేశాలు ఇందులోనికి రావు.

ఇంకా ధర్మ పండితులు ఇలా అన్నారు: ఎవరైతే పచ్చి వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు పచ్చి ఉల్లి ఆకులు తింటాడో; మస్జిదు ఖాళీగా ఉండి ఎవరూ లేకపోయినప్పటికీ, అతడు మస్జిదులోనికి ప్రవేశించకుండా నిషేధించబడతాడు అనడానికి ఈ హదీథు ఒక నిదర్శనం; ఎందుకంటే మస్జిదు దైవదూతలు ఉండే ప్రదేశం, వారి నివాస స్థలం. మరియు ఈ హదీథు ఉన్న సందేశం యొక్క సాధారణత్వం కూడా మరొక కారణం.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు