(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే…

(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: (నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నమాజులో పురుషులకొరకు శ్రేష్ఠమైన పంక్తులు, అత్యధిక ప్రతిఫలం, పుణ్యఫలం మరియు ఘనత కలిగిన పంక్తులు – మొదటి పంక్తులు. ఎందుకంటే ఇవి ఇమామ్’కు దగ్గరగా ఉంటాయి మరియు ఆయన పఠనాన్ని ఈ పంక్తులు శ్రధ్ధగా వింటాయి మరియు స్త్రీలకు దూరంగా ఉంటాయి కనుక. మరియు అధమమైన వరుసలు, తక్కువ ప్రతిఫలం మరియు తక్కువ ఘనత కలిగిన వరుసలు మరియు (నమాజుకు సంబంధించి) షరియత్ ద్వారా అవసరమైన వాటికి దూరంగా ఉండే వరుసలు చివరి వరుసలు. మహిళలకు ఉత్తమమైన వరుసలు చివరివి, ఎందుకంటే చివరి వరుసలు మహిళలకు ఎక్కువ పరదాను కలుగజేస్తాయి, పురుషులతో కలవకుండా, వారికి దూరంగా, వారిని చూడకుండా మరియు వారి కారణంగా మనోవికారం వంటి వాటికి గురి కాకుండా చేస్తాయి. అలాగే మహిళల కొరకు అధమమైన వరుసలు మొదటి వరుసలు, ఎందుకంటే మొదటి వరుసలు పురుషులకు సమీపంగా ఉంటాయి, మరియు ఆ కారణంగా స్త్రీల హృదయాలు ప్రలోభానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

فوائد الحديث

ఇందులో అల్లాహ్ యొక్క విధేయత కొరకు, మరియు ఆయన ఆరాధన కొరకు అనునిత్యమూ త్వరపడాలని, నమాజులో ముందు వరుసలు పొందడానికి కృషి చేయాలని హితబోధ ఉన్నది.

స్త్రీలు మసీదులో ప్రత్యేక వరుసలలో, పురుషులతో పాటు నమాజు ఆచరించుట అనుమతించబడినదే, అయితే స్త్రీలు పరదా పాటిస్తూ, అణకువ, వినయము కలిగి మస్జిదులలో నమాజు ఆచరించాలి.

స్త్రీలు మస్జిదులో నమాజు ఆచరిస్తున్నపుడు పురుషులకు మాదిరిగానే వారు కూడా వరుసలలో నిలబడతారు. వరుసలో ఒకరి నుండి మరొకరు దూరంగా కాకుండా దగ్గర దగ్గరగా పురుషులు ఏ విధంగా నిలబడతారో వారు కూడా వరుసలలో అదే విధంగా నిలబడాలి. ఒకరికి మరొకరికి మధ్య ఖాళీ ఉన్నట్లైతే ఆ ఖాళీలను, పురుషులు తమ వరుసలలో పూర్తి చేయునట్లు పూర్తి చేయాలి.

ఆరాధనా స్థలాలు అయినా సరే పురుషుల నుండి దూరాన్ని పాటించాలని మహిళలను ప్రోత్సహించడంలో మహిళల సంరక్షణ పట్ల షరియత్ యొక్క గొప్ప శ్రద్ధను చూడవచ్చు.

ఆచరణలను ఆధారంగా ప్రజలు ఔన్నత్యములో భిన్నస్థాయిలలో ఉంటారు.

ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: నమాజులో పురుషుల వరుసలకు సంబంధించి చూసినట్లైతే అవి సాధారణమైనవే, అయితే వాటిలో అత్యుత్తమమైనవి అన్నివేళలా మొదటి వరుసలే, మరియు వాటిలో అధమమైనవి అన్నివేళలా ఆఖరి వరుసలే. హదీథులో పేర్కొనబడిన స్త్రీల వరుసలు ఏవి అంటే, మస్జిదులో పురుషులతో పాటు నమాజు ఆచరించే స్త్రీల యొక్క వరుసలు. అయితే ఒకవేళ స్త్రీలు విడిగా నమాజు ఆచరిస్తున్నట్లైతే (ఉదాహరణకు: మస్జిదులో స్త్రీల కొరకు వేరే గది ప్రత్యేకించబడి ఉండి, స్త్రీలు ఆ గదిలో నమాజు ఆచరిస్తున్నట్లైతే) అపుడు స్త్రీల వరుసల ఘనత, పుణ్యఫలము మొదలైనవి పురుషుల వరసలకు మాదిరిగానే వర్తిస్తాయి, అంటే ఆ స్థితిలో స్త్రీలకొరకు ఉత్తమమైనవి మొదటి వరుసలు, మరియు అధమమైనవి చివరి వరుసలు అవుతాయి.

ఇమాం నవవీ ఇంకా ఇలా అన్నారు: ఈ హదీథులో మొదటి వరుస ప్రశంసించబడినది, మరియు వేరే హదీథులలో మొదటి వరుస యొక్క ఘనతలు పేర్కొనబడినాయి; ఈ హదీథులలో పేర్కొనబడిన మొదటి వరుస ఏది అంటే, అది ఇమాంకు సరిగ్గా వెనుక ఉన్న వరుస. ఆ వరుసలోని వ్యక్తి ముందుగా వచ్చినా, లేక ఆలస్యంగా వచ్చినా, అలాగే ఆ వరుస పూర్తి అయినా లేక అసంపూర్తిగా ఉన్నా లేక అటువంటి మరే విషయం ఉన్నా లేకపోయినా.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు