إعدادات العرض
“నిశ్చయంగా దాని కారణంగా అల్లాహ్ ఆమె కొరకు స్వర్గాన్ని ‘వాజిబ్’ (తప్పనిసరి) చేసాడు” లేదా ఆయన సల్లల్లాహు అలైహి…
“నిశ్చయంగా దాని కారణంగా అల్లాహ్ ఆమె కొరకు స్వర్గాన్ని ‘వాజిబ్’ (తప్పనిసరి) చేసాడు” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దాని కారణంగా ఆమెకు నరకం నుండి విడుదలను ప్రసాదించినాడు.”
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ఒక పేద స్త్రీ తన ఇద్దరు కూతుళ్ళను ఎత్తుకుని నా వద్దకు వచ్చింది. నేను ఆమెకు మూడు ఖర్జూరాలు ఇచ్చాను. ఆమె రెండు ఖర్జూరాలను తన కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది. (మిగిలిన) ఖర్జూరాన్ని తను తినడానికి నోటి దగ్గరకు చెయ్యి ఎత్తింది. ఇంతలో ఆమె కూతుళ్ళు అది తమకు కావాలని అడిగారు. ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి తన కూతుళ్ళకు చెరొక భాగాన్ని పంచి పెట్టింది. ఆమె చర్య నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనను నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వివరించాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా దాని కారణంగా అల్లాహ్ ఆమె కొరకు స్వర్గాన్ని ‘వాజిబ్’ (తప్పనిసరి) చేసాడు” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దాని కారణంగా ఆమెకు నరకం నుండి విడుదలను ప్రసాదించినాడు.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Hausa Kurdî Kiswahili Magyar ქართული සිංහල Română অসমীয়া ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ ગુજરાતી Македонски Nederlands ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ఈ హదీథులో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సంఘటనను ఇలా ప్రస్తావిస్తున్నారు: ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఒక పేద మహిళ ఆమె వద్దకు వచ్చి మూడు ఖర్జూరాలు అడిగింది. ఆమె తన ఇద్దరు కూతుళ్ళకు ఒక్కొక్క ఖర్జూరాన్ని ఇచ్చింది మరియు మిగిలిన ఒక ఖర్జూరం తినేందుకు తన చేతిని తన నోటి దగ్గరికి ఎత్తింది. ఆమె తినాలనుకున్న ఆ ఖర్జూరాన్ని ఆమె ఇద్దరు కూతుళ్ళు తమకు కావాలి అని అడిగారు, అపుడు ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి ఆ ఇద్దరికీ పంచి పెట్టింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె పరిస్థితి చూసి ముగ్ధురాలైంది, మరియు ఆ మహిళ చేసిన పనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పింది, అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ఆ ఖర్జూరం కారణంగా ఆమెకు స్వర్గాన్ని వాజిబ్ చేసినాడు (తప్పనిసరి చేసినాడు); లేక ఆ ఖర్జూరము కారణంగా ఆమెను నరకాగ్ని నుండి రక్షించినాడు.”فوائد الحديث
ఈ హదీథులో దానగుణం యొక్క ఘనతను చూడవచ్చు; చేసిన దానము చిన్నదే అయినప్పటికీ, అది విశ్వాసికి తన ప్రభువుపై విశ్వాసానికి, ఆయన చేసిన వాగ్దానానికి మరియు ఆయన కృపపై అతని నమ్మకానికి నిదర్శనం.
తల్లులకు తమ పిల్లల పట్ల ఉన్న అపారమైన ప్రేమ, దయ మరియు వారి శ్రేయస్సు పట్ల వారికున్న తీవ్రమైన చింత, ఆందోళన.
ఇందులో నిస్వార్థత, సంతానం పట్ల కరుణ, కుమార్తెల పట్ల అసాధారణమైన దయ, ప్రేమ మరియు సౌమ్యత యొక్క ఘనతను చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమె స్వర్గంలో ప్రవేశించడానికి మరియు నరకాగ్ని నుండి మోక్షానికి ఆమె కుమార్తెలు కారణమయ్యారు.
తక్కువ మొత్తం కదా అని దానధర్మాలు చేయకుండా ఉండరాదు. బదులుగా, దానం చేయు వ్యక్తి తాను సులభంగా దానం చేయగలిగిన దానిని దానం చేయాలి, అది కొంచెమైనా లేదా ఎక్కువైనా సరే, తప్పక దానం చేయాలి.
ఈ హదీథ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి పరిస్థితిని మరియు వారి ఇంట్లో తినడానికి ఒకటి, రెండు లేదా మూడు ఖర్జూరాలు తప్ప మరేమీ లేనప్పుడు, ఆయన మరియు ఆయన కుటుంబం ఎలా జీవించేవారో తెలుపుతున్నది.
التصنيفات
సత్కర్మల ప్రాముఖ్యతలు