సత్కర్మల ప్రాముఖ్యతలు

సత్కర్మల ప్రాముఖ్యతలు

5- “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్*. అబూ ఖిలాబహ్ (హదీసు ఉల్లేఖకులలో ఒకరు) ఇలా అన్నారు: “ఆయన కుటుంబము (పై ఖర్చు చేయుట) తో మొదలు పెట్టినారు”, తరువాత అబూ ఖిలాబహ్ ఇంకా ఇలా అన్నారు: “తన కుటుంబములోని చిన్న పిల్లల కోసం ఖర్చు చేసే వ్యక్తి కంటే గొప్ప ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? తద్వారా అతడు వారిని కాపాడుతాడు (కోరికల నుండి కాపాడతాడు) మరియు దాని వల్ల అల్లాహ్ వారికి లాభం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.”

9- “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?*”. దానికి సహాబాలందరూ “తప్పనిసరిగా ఓ రసూలుల్లాహ్!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనుకూలంగా లేని పరిస్థితులలోనూ పరిపూర్ణంగా ఉదూను ఆచరించుట; మస్జిదునకు ఎక్కువ అడుగులతో వెళ్ళుట (ప్రతిరోజూ ఐదు నమాజులను మస్జిదులో ఆచరించుట); ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి చూచుట. మరియు అది ‘అర్’రిబాత్’ అనబడుతుంది”.