.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.

[ప్రామాణికమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇళ్ళలో సలాహ్ (నమాజు) ఆచరించకుండా, వాటిని స్మశానాల మాదిరి అనిపించేలా చేయడాన్ని నిషేధించినారు. ఎందుకంటే స్మశానాలలో నమాజులు చదువబడవు. తన సమాధిని మాటిమాటికి దర్శించడాన్ని, ఒక అలవాటుగా అక్కడ మాటిమాటికీ సమావేశం కావడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. ఎందుకంటే అలా చేయడం షిర్క్’నకు దారి తీసే కారణాలలో ఒకటి కాగలదు. ఈ భూప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, తనపై (అల్లాహ్ యొక్క) శాంతి కొరకు ప్రార్థించమని (దరూద్ పఠించమని) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. ఆ దరూద్’లు ఎంత దూరం నుండైనా, దగ్గరి నుండైనా ఒకేలా తనకు చేరుతాయని తెలియ జేస్తున్నారు. కనుక వారి సమాధిని మాటిమాటికి దర్శించడానికి తొందర పడవలసిన అవసరం లేదు.

فوائد الحديث

ఇళ్ళు స్మశానాలుగా మారకుండా నిషేధించడం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధనలో ఒక భాగం.

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించడానికి (మాటిమాటికి) ప్రయాణించడంపై నిషేధం కనిపిస్తున్నది. దానికి బదులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించమని ఆదేశించబడుతున్నది, మరియు ఆ దరూద్ వారిని చేరుతుందని తెలియ జేయ బడుతున్నది. తద్వారా అతడి ప్రయాణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు కొరకు మరియు అందులో సలాహ్ ఆచరించుట కొరకు మాత్రమే కావవలెను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని, అలాగే మరింకే సమాధినైనా, ఒక ప్రత్యేక సమయంలోనో లేక ఒక ప్రత్యేక పధ్ధతినో అనుసరించి మాటిమాటికీ దర్శించడం అనేది అక్కడ ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

మీరు ఎక్కడ ఉన్నా, ఏ సమయం లోనైనా, షరియత్’ను అనుసరించి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడంలోనే అల్లాహ్ వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఘనత ఉన్నది.

ఏ విధంగా నైతే సమాధుల వద్ద నమాజు ఆచరించుట సహాబాల కొరకు నిషేధించబడినదో, అదే విధంగా, ఏ నమాజూ చదవబడని స్మశానాల మాదిరిగా ఇళ్ళు మారడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు