“ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను…

“ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ సలాం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి తరలి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూడడానికి తండోపతండాలుగా వెళ్ళారు. ప్రజలు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు” అని మూడు సార్లు అన్నారు. నేను వారితో కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడడానికి వచ్చాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడటానికి ప్రజలతో వచ్చాను; ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: “ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయనను చూడడానికి ఆయన వైపునకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన వైపు వెళ్ళిన వారిలో యూదపండితుడైన అబ్దుల్లా ఇబ్న్ సలామ్ (రదియల్లాహు అన్హు) ఒకరు (అప్పటికి ఆయన ఇస్లాం స్వీకరించలేదు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూసిన వెంటనే ఆయనలో కనిపించిన తేజస్సు, సౌందర్యం మరియు నిజమైన గాంభీర్యం కారణంగా ఆయన ముఖం అబద్ధాలు పలికేవాని ముఖం కాదని, అతనికి తెలిసిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి అతను విన్న మొదటి విషయం ఏమిటంటే, స్వర్గంలోనికి చేర్చే పనులు చేయమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను కోరినారు, వీటిలో: మొదటిది: ‘సలాం’ను (శాంతి శుభాకాంక్షలను) బహిరంగంగా వ్యాప్తి చేయుట; తరుచుగా సలాం చేయుట, తెలిసిన వారికైనా మరియు తెలియని వారికైనా. రెండవది: ఒక సదఖాగా (దాతృత్వరూపేణా), విందు రూపంలో; మరియు ఆతిథ్యం ద్వారా ప్రజలకు అన్నం తినిపించుట. మూడవది: మీ తండ్రి వైపు నుండి లేదా తల్లి వైపు నుండి మీకు రక్త సంబంధాలు లేదా బంధుత్వం ఉన్నవారితో బంధుత్వాలను, కుటుంబ సంబంధాలను కొనసాగించడం. నాలుగవది: ఐచ్ఛిక (స్వచ్చంద) ఆరాధన అయిన రాత్రి నమాజును (ఖియాముల్లైల్ నమాజును) ప్రజలు నిద్రిస్తున్న సమయాన ఆచరించుట.

فوائد الحديث

ముస్లింల మధ్య ‘సలాం’ను (శాంతి శుభాకాంక్షలను) వ్యాప్తి చేయడం అభిలషణీయం. ముస్లిమేతరుల విషయానికొస్తే, ఒక ముస్లిం ముందుగా అతనికి సలాం చేయరాదు. ఒకవేళ ముస్లిమేతరుడు ఎవరైనా మీకు ‘అస్సలాము అలైకుం’ (మీకు శాంతి కలుగు గాక) అని సలాం చేస్తే, “వ అలైకుం” (మీకు కూడా) అని సమాధానం చెప్పాలి

التصنيفات

తహజ్జుద్ నమాజ్, సత్కర్మల ప్రాముఖ్యతలు