“మీ ప్రభువైన అల్లాహ్’కు భయపడండి; మీ ఐదింటిని (నమాజులను) ఆచరించండి; మీ (రమదాన్) నెల ఉపవాసములను ఆచరించండి; మీ సంపదల…

“మీ ప్రభువైన అల్లాహ్’కు భయపడండి; మీ ఐదింటిని (నమాజులను) ఆచరించండి; మీ (రమదాన్) నెల ఉపవాసములను ఆచరించండి; మీ సంపదల నుండి జకాతు చెల్లించండి; మీ పాలకులకు విశ్వాసపాత్రులై ఉండండి; (ఇలా చేస్తే) మీ ప్రభువు యొక్క స్వర్గములో మీరు ప్రవేశిస్తారు.”

అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) లో ప్రసంగిస్తూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీ ప్రభువైన అల్లాహ్’కు భయపడండి; మీ ఐదింటిని (నమాజులను) ఆచరించండి; మీ (రమదాన్) నెల ఉపవాసములను ఆచరించండి; మీ సంపదల నుండి జకాతు చెల్లించండి; మీ పాలకులకు విశ్వాసపాత్రులై ఉండండి; (ఇలా చేస్తే) మీ ప్రభువు యొక్క స్వర్గములో మీరు ప్రవేశిస్తారు.”

[దృఢమైనది]

الشرح

హిజ్రీ పదవ సంవత్సరములో జరిగిన “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) లో అరఫా దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించినారు. ఆ సంవత్సరం జరిగిన హజ్ “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) గా పిలువబడింది; కారణం ఆ ప్రసంగములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల నుండి వీడుకోలు తీసుకున్నారు. ఆయన ప్రజలందరినీ ఈ విధంగా ఆదేశించినారు - తమ ప్రభువు (అయిన అల్లాహ్) ఆదేశాలను పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి; రాత్రింబవళ్ళలో విధిగా ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఐదు నమాజులను ఆచరించాలి; రమజాన్ మాసము ఉపవాసాలు పాటించాలి; తమ సంపదల నుండి, అర్హులైన వారికి జకాతు చెల్లించాలి; అందులో పిసినారితనం వహించకండి; అల్లాహ్ విధేయతకు వ్యతిరేకం కానంతవరకు - అల్లాహ్ తమపై పాలకులుగా నియమించిన వారికి – విధేయులై ఉండాలి. ఎవరైతే పైన పేర్కొనబడిన అంశాలను ఆచరిస్తారో, వారి ప్రతిఫలం స్వర్గములోనికి ప్రవేశము అవుతుంది.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు