అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో…

అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు". ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను ఇంకా ప్రశ్నించి ఉంటే ఇంకా చెప్పి ఉండేవారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఉత్తమమైన ఆచరణ ఏది?” అని. ఆయన “విధిగా ఆచరించవలసిన ప్రతి ఫర్ద్ నమాజును, షరియత్ ప్రదాత (అయిన అల్లాహ్) దాని కొరకు నిర్ధారించిన సమయములోనే ఆచరించుట” అన్నారు. దాని తరువాత తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగి ఉండడం, వారి పట్ల విధేయత కలిగి ఉండడం, వారి హక్కులను నెరవేర్చడం, వారికి అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండడం (అన్నారు); దాని తరువాత - తన సంపదతో, తన ప్రాణముతో అల్లాహ్ యొక్క వాక్కును ఉన్నతం చేయుట కొరకు, ఇస్లాం ధర్మాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి, మరియు ఇస్లాం ధర్మపు ఆచారాలను రక్షించడానికి - అల్లాహ్ కొరకు జిహాదు చేయుట – అన్నారు. ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించి ఉంటే, ఆయన ఇంకా ఎక్కువ (విషయాలు) చెప్పి ఉండేవారు.”

فوائد الحديث

ఆచరణల యొక్క ఘనత అల్లాహ్ వాటిని ఇష్టపడే క్రమాన్ని బట్టి ఉంటుంది.

ఇందులో – ఘనత కలిగిన విషయాలలో ఎక్కువ ఘనత కలిగిన వాటిని ఆచరించుటపై ప్రతి ముస్లిం ఎక్కువ ఆసక్తి చూపాలి అనే హితబోధ ఉన్నది.

ఉత్తమ ఆచరణలను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధానాలు – వ్యక్తికీ-వ్యక్తికి మధ్య ఉండే శక్తి సామర్థ్యాల తేడాపై, వాటిని గురించి ప్రశ్నించిన వారి స్థితిగతులపై, మరియు వారి కొరకు ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు, నమాజు ప్రాముఖ్యత