“ప్రతి మంచి పని పుణ్యకార్యమే”

“ప్రతి మంచి పని పుణ్యకార్యమే”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు “ప్రతి మంచి పని పుణ్యకార్యమే”.

[దృఢమైనది] [رواه البخاري من حديث جابر ورواه مسلم من حديث حذيفة]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రతి మంచి పని, లేక ఇతరులకు ప్రయోజనం కలిగేలా చేసిన ప్రతి కార్యము, అది మాటల ద్వారా కానీ లేక చేతల ద్వారా కానీ, అది పుణ్యకార్యమే అవుతుంది. దానికి పుణ్యము మరియు ప్రతిఫలము రెండూ ఉన్నాయి – అని తెలియజేస్తున్నారు.

فوائد الحديث

సత్కార్యము అంటే ఒకరు మరొకరికి ధన సహాయం చేయడం లేక ఏదైనా దానం చేయడానికే పరిమితం కాదు. వాస్తవానికి మనిషి చేసే ప్రతి ‘మంచి’, అతడు పలికే మంచి మాటలు, ప్రజలకు సన్మార్గం వైపునకు అతడు చేసే మార్గ దర్శనం మొదలైనవి అన్నీ అందులో కలిసి ఉన్నాయి.

అందులో, ఇతరులకు ఉపకారము, అనుగ్రహము చేయాలనే, ప్రయోజనం కలిగించే కార్యములు చేయాలనే అబిలాష కూడా ఉన్నాయి.

సత్కార్యాన్ని చిన్నదిగా, అల్పమైనదిగా చూడరాదు, అది ఎంతో తేలికగా చేయదగినది అయినా సరే.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు