“మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్…

“మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్

సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్. అబూ ఖిలాబహ్ (హదీసు ఉల్లేఖకులలో ఒకరు) ఇలా అన్నారు: “ఆయన కుటుంబము (పై ఖర్చు చేయుట) తో మొదలు పెట్టినారు”, తరువాత అబూ ఖిలాబహ్ ఇంకా ఇలా అన్నారు: “తన కుటుంబములోని చిన్న పిల్లల కోసం ఖర్చు చేసే వ్యక్తి కంటే గొప్ప ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? తద్వారా అతడు వారిని కాపాడుతాడు (కోరికల నుండి కాపాడతాడు) మరియు దాని వల్ల అల్లాహ్ వారికి లాభం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్చు చేయడం యొక్క వివిధ రూపాలను గురించి వివరిస్తున్నారు. మనం ఖర్చు చేసేటపుడు, ఖర్చు చేసే అంశాల ప్రాధాన్యతలో విభేదిస్తే, అన్నింటి కంటే ముందు విధిగా ఖర్చు చేయవలసిన అంశాల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే విధంగా అంశాల ప్రాధాన్యతా క్రమంలో వాటిని అమర్చినారు. ఎవరిపై ఖర్చు చేయుట తనపై విధిగా ఉన్నదో, వారి కొరకు ఖర్చు చేయబడిన ధనం, సంపద ఒక ముస్లింకు అత్యంత ప్రతిఫలదాయకమైనది. ఉదాహరణకు : భార్య, పిల్లలు మొదలైనవారు. తరువాత, అల్లాహ్ మార్గములో ధర్మయుద్ధము కొరకు తయారు చేయబడిన వాహనము (జంతువు, ఒంటే, గుర్రము మొ.) పై ఖర్చు చేయుట. తరువాత అల్లాహ్ మార్గములో జిహాద్ (ధర్మయుద్ధము) చేయుచున్న స్నేహితులు మరియు సహచరులపై ఖర్చుచేయుట.

فوائد الحديث

ఖర్చు చేయవలసిన అంశాలను వాటి ప్రాముఖ్యత మరియు ఘనత ఆధారంగా ఒక క్రమంలో అమర్చుకోవాలి. వాటిలో ఏమైనా విభేదము ఉన్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పై ఉదాహరణను పరిగణనలోనికి తీసుకోవాలి.

ఇందులో ఒక వ్యక్తి తన కుటుంబము పై చేయు ఖర్చు ప్రాముఖ్యతలో మిగతా వాటి కన్నా ఘనమైనది.

అల్లాహ్ మార్గములో జిహాదు (ధర్మయుద్ధము) కొరకు చేయు ఖర్చు అత్యంత ఉత్తమమైన వాటిలో ఒకటి, ఉదాహరణకు జిహాదు కొరకు కావలసిన ఆయుధాలు, పనిముట్లు, సాధనాల కొరకు, అలాగే జిహాదులో పాల్గొనే వారిని తయారు చేయుట కొరకు, అంటే ఉదాహరణకు వారి శిక్షణ మరియు ఇతర విషయాల కొరకు ఖర్చు చేయుట.

ధర్మపండితుల ద్వారా ఈ విధంగా చెప్పబడినది: “అల్లాహ్ మార్గములో” (ఫీ సబీలిల్లాహ్) అంటే దాని అర్థము – అల్లాహ్ యొక్క విధేయతలో ఆచరించు ప్రతి ఆచరణ.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు, అవయవాల కార్యాల ప్రాముఖ్యతలు