అవయవాల కార్యాల ప్రాముఖ్యతలు

అవయవాల కార్యాల ప్రాముఖ్యతలు

1- “ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”

3- “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”