“మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు…

“మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయాన్ని స్పష్ట పరిచినారు – అది విశ్వాసులు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అయితే వారు ఒకరినొకరు ప్రేమించనంత వరకు విశ్వాసము సంపూర్ణము కాదు, మరియు ముస్లిం సమాజము యొక్క స్థితి కూడా వృధ్ధి చెందదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిం సమాజములో ప్రేమ ప్రవర్థిల్లు ఆచరణల వైపునకు మనలకు మార్గదర్శకం చేసినారు – అది ఏమిటంటే, అల్లాహ్ తన దాసులు ఒకరినొకరు అభివందనం చేయుట కొరకు సూచించిన “సలాము”, దానిని వ్యాపింపజేయమని తెలిపినారు.

فوائد الحديث

స్వర్గములోనికి ప్రవేశము, కేవలం (ఇస్లాంను) విశ్వసించుట ద్వారానే జరుగుతుంది.

ముస్లిం యొక్క విశ్వాసములో పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, అతడు తన స్వయం కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సహోదరుని కొరకు (తోటి ముస్లిం కొరకు కూడా) దానినే ఇష్టపడినపుడు.

సలాంను వ్యాపింపజేయుట మరియు ముస్లిములకు దానిని అందజేయుట (సలాం చేయుట) అభిలషనీయమైన ఆచరణ, ఎందుకంటే అది ప్రజల మధ్య శాంతిని, ప్రేమను వ్యాపింపజేస్తుంది.

సలాం ముస్లిములకు మాత్రమే చేయబడుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో “మీ మధ్య” (సలాం ను వ్యాపింపజేయండి) అని అన్నారు.

సలాం వ్యాప్తి చేయడం అనేది సమాజములో విభాజనను, వలసలను మరియు శతృత్వాన్ని తొలగిస్తుంది.

ఇందులో ముస్లిముల మధ్య ప్రేమ ఉండవలసిన విషయపు ప్రాధాన్యత తెలుస్తున్నది. మరియు అది విశ్వాసపు సంపూర్ణతలో ఒక భాగము

మరొక హదీథులో సలాం యొక్క పూర్తి వాక్యము పేర్కొన బడింది – అది – “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు’. అయితే ‘అస్సలాము అలైకుం’ అనడం కూడా సరిపోతుంది.

التصنيفات

అవయవాల కార్యాల ప్రాముఖ్యతలు