“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో…

“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ప్రతి రోజూ విధిగా ఆచరించే ఐదుపూటల నమాజులు, ప్రతి శుక్రవారము ఆచరించే ‘శుక్రవారపు జుమఅహ్ నమాజు’, మరియు ప్రతి సంవత్సరం రమదాన్ నెల ఉపవాసాలు విధిగా ఆచరించుట – వాటి మధ్య (దాసుని వల్ల) జరిగే చిన్న పాపములకు అవి పరిహారంగా మారతాయి; అయితే పెద్ద పాపములకు దూరంగా ఉండాలి. పెద్ద పాపములు (అల్ కబాయిర్) అంటే - వ్యభిచారానికి, వివాహేతర లైంగిక సంబంధాలకు పాల్బడుట, మద్యపానము చేయుట వంటివి పరిహరించబడవు. అవి క్షమింపబడుట కొరకు పశ్చాత్తాపము తప్పనిసరి.

فوائد الحديث

పాపములు రెండు రకములు, అవి చిన్న పాపములు (అస్’సగాఇర్) మరియుపెద్ద పాపములు (అల్ కబాఇర్) అని తెలుస్తున్నది.

చిన్న పాపములు పరిహరించ బడుట అనేది, పెద్ద పాపములనుండి దూరంగా ఉండుటపై ఆధారపడి ఉన్నది.

పెద్ద పాపములు (అల్ కబాఇర్) ఎటువంటివి అంటే వాటికి ఈ ప్రపంచంలో శిక్ష ఉన్నది లేదా తీర్పు దినము నాడు వాటి కొరకు తీవ్రమైన శిక్షను గురించి లేదా అల్లాహ్ యొక్క తీవ్రమైన క్రోధమును గురించి హెచ్చరిక ఉన్నది లేదా వాటికి పాల్బడే వాని కొరకు తీవ్రమైన శాపమును గురించి హెచ్చరిక ఉన్నది, ఉదాహరణకు మద్యపానము, వ్యభిచారము మొదలైనవి.

التصنيفات

సద్గుణాలు మరియు పద్దతులు, సత్కర్మల ప్రాముఖ్యతలు, నమాజు ప్రాముఖ్యత