إعدادات العرض
“ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను…
“ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt ئۇيغۇرچە Hausa Kurdî Kiswahili Português සිංහල Nederlands ગુજરાતી অসমীয়া አማርኛ پښتو ไทย नेपाली മലയാളം Oromoo Yorùbá ქართული Magyarالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఎవరైతే ఇద్దరు కూతుళ్లు లేదా ఇద్దరు అక్కచెళ్ళెల్లు కలిగి ఉండి వారి మంచిచెడులు, బాగోగులు చూస్తూ, మంచిపనులు చేయుటకు వారికి మార్గనిరర్దేశం చేస్తూ, చెడుపనుల నుంచి వారిని హెచ్చరిస్తూ వారు పెద్దవాళ్లు అయ్యే వరకు వారిని పెంచిపోషిస్తాడో, అటువంటి వ్యక్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దరూ ప్రళయదినమున ఈ రెండింటి మాదిరిగా (అంటే అంత దగ్గరగా) వస్తారు అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపినారు.فوائد الحديث
కుమార్తెలను జాగ్రత్తగా చూసుకుని, వారు వివాహం చేసుకునే వరకు లేదా వారు యుక్తవయస్సు చేరుకునే వరకు వారిని పెంచి పోషించే వారికి గొప్ప పుణ్యఫలం ఉన్నది, అక్కచెల్లెళ్ళను పెంచి పోషించే విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.
కుమార్తెల బాగోగులు, మంచి చెడులు చూసుకున్నందుకు లభించే పుణ్యఫలం, కుమారుల బాగోగులు మంచి చెడులు చూసుకున్న దాని కంటే ఎక్కువ. ఎందుకంటే కుమారులను గురించి ఇలాంటిదేమీ ప్రస్తావించబడలేదు. కుమార్తెల వ్యవహారాలను మంచిగా చూసుకోవడం, కుమారుల వ్యవహారాల కంటే గొప్పది ఎందుకంటే, కుమార్తెలు “ఔరహ్” (వారు అన్నివేళలా కప్పబడినట్లు ఉంటారు) గనుక. వారు తమ వ్యవహారాలను అబ్బాయిల మాదిరిగా నిర్వహించలేరు. అంతేగాక ఒక తండ్రి తన శత్రువులను ఎదుర్కోనడానికి తన కుమార్తెలలో కంటే తన కుమారులలో బలాన్ని కోరుకుంటాడు, అలాగే తన పేరు మరియు తన వంశపు కొనసాగింపు కోసం తన కుమార్తెలపై ఆధారపడడు. అందువల్ల, తన కుమార్తెలను పోషించే వ్యక్తి వారి పెంపకంలో ఓపికగా ఉండాలి, సహనం వహించాలి, వారి బాధ్యతను హృదయపూర్వకంగా నిర్వహించాలి, మంచి సంకల్పము కలిగి ఉండాలి. కనుకనే కుమార్తెల పోషణ పట్ల అంత గొప్ప ప్రతిఫలం ఉన్నది – మరి అటువంటి వ్యక్తి తీర్పుదినమునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుడై ఉంటాడు
ఆడపిల్ల యుక్త వయస్సుకు చేరినది అనుటకు నిదర్శనాలు: పదిహేను సంవత్సరాల వయస్సుకు చేరడం, మొదటిసారి ఋతుస్రావానికి గురికావడం (పదిహేను సంవత్సరాల వయస్సుకు చేరకపోయినా); లేదా నాభి క్రింది భాగములో ఆమె యోనిభాగము చుట్టూ ముతకముతకగా వెంట్రుకలు మొలవడం, లేదా స్వప్నస్ఖలనం జరగడం, అంటే నిద్రలో వీర్యము విడుదల కావడం. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి జరిగినా ఆమె యుక్తవయస్సుకు చేరినట్టుగా భావించబడుతుంది.
ఇమాం ఖుర్తుబి ఇలా అన్నారు: యుక్తవయస్సుకు చేరుకోవడం అంటే స్వతంత్రంగా వ్యవహరించే స్థితికి చేరుకోవడం; స్త్రీల విషయంలో ఈ స్థితి వారికి వివాహమై, వారి భర్తలు వారితో శారీరక సంబంధం నెలకొల్పిన తరువాత మాత్రమే (శోభనం జరిగిన తరువాత మాత్రమే) వారికి ప్రాప్తమవుతుంది. కనుక ఇక్కడ యుక్తవయస్సు మరియు స్వతంత్రంగా వ్యవహరించే స్థితి అంటే దాని అర్థం ఆమె మొదటిసారి ఋతుస్రావానికి గురికావడం, తద్వారా ఆమెపై ధార్మిక ఆచరణల ఆదేశాలన్నీ వర్తించడం మాత్రమే కాదు; ఎందుకంటే ఆమె రజస్వల కాకముందే ఆమెకు వివాహమై ఆమె సంరక్షకునిగా ఆమె భర్త తప్ప మరొకరి అవసరం లేని స్థితికి ఆమె చేరుకోవచ్చు. లేదా ఆమెకు సంబంధించిన ఏ వ్యవహారం లోనూ ఆమె స్వతంత్రంగా వ్యవహరించే స్థితిలో లేకపోయినా ఆమె రజస్వల స్థితికి లోనుకావచ్చు. ఆ స్థితిలో, అంటే ఆమె యుక్తవయస్సుకు చేరింది కదా అని ఆమెను అలాగే వదిలి వేయడం జరిగితే ఆమె ఒంటరిదై పోయి తనను తాను కోల్పోయే పరిస్థితిలో పడిపోవచ్చు మరియు ఆమె వ్యవహారాలన్నీ నాశనం అయిపోవచ్చు. ఇటువంటి స్థితిలో ఆమెకు సంరక్షకుని మద్దతు, అతని రక్షణ మరింత అవసరం అవుతుంది. ఆమెకు వివాహం అయ్యే వరకు ఆమె సంరక్షకుడు ఆమెకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే మన ధర్మపండితులు ఆమె యుక్తవయస్సుకు చేరుకున్న వెంటనే తండ్రిపై నుండి ఆమె పోషణ బాధ్యత తొలగిపోదని, ఆమెకు వివాహమై ఆమెకు ఆమె భర్తతో శోభనం (శారీరక సంబంధం) జరగనంత వరకు ఆమె పోషణ బాధ్యత అతనిపై అలాగే ఉంటుంది అని అన్నారు.
التصنيفات
సత్కర్మల ప్రాముఖ్యతలు