“అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న…

“అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది

సహ్ల్ ఇబ్నె సా’ద్ అస్’సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది; , మరియు స్వర్గములో, మీలో ఎవరి వద్దనైనా ఉన్న చిన్న కొరడాతో ఆక్రమించ దగినంత చిన్న స్థలమైనా ఈ ప్రపంచం కంటే మరియు దాని ఉపరితలంపై ఉన్న దాని ప్రతిదాని కన్నా ఉత్తమమైనది; మరియు అల్లాహ్ యొక్క దాసుడు, ఒక ఉదయం లేదా ఒక సాయంత్రం అల్లాహ్ మార్గములో చేసే ప్రయాణం ఈ ప్రపంచం మరియు దాని ఉపరితలంపై ఉన్న ప్రతి దాని కంటే ఉత్తమమైనది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ముస్లింలకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రదేశంలో అల్లాహ్ కొరకు నిజాయితీగా ఒక రోజు ముస్లింలను వారి నుండి కాపాడటం ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడటానికి ఉపయోగించే కొరడా, స్వర్గం లో ఎంత స్థలమైతే ఆక్రమించగలదో, అది ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; మరియు దినము ప్రారంభం నుండి మధ్యాహ్నం ముందు వరకు లేదా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అల్లాహ్ మార్గంలో ఒక్కసారి నడిచినట్లైతే అందుకు లభించే ప్రతిఫలం మరియు బహుమానం ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.

فوائد الحديث

అల్లాహ్ మార్గంలో రిబాత్ పాటించడంలో ఉన్న ఘనత ఏమిటంటే, అది తన ప్రాణాన్ని పణంగా పెట్టడంతో సమానం, అది అల్లాహ్ యొక్క వాక్కును సమున్నతం చేస్తుంది, మరియు ఆయన ధర్మాన్ని బలపరుస్తుంది. కనుక రిబాత్ ఒక్క దినము పాటించినా దాని ప్రతిఫలం ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది.

పరలోకంతో పోలిస్తే ఈ ప్రపంచం ఏమాత్రమూ ప్రాముఖ్యత లేనిది; ఎందుకంటే స్వర్గంలో ఒక కొరడా ఆక్రమించే స్థానం ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.

అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఘనత మరియు దాని వలన కలిగే ప్రతిఫలం అపారమైనది, ఎందుకంటే ఆయన మార్గంలో ఒక సాయంత్రం లేదా ఉదయం నడక యొక్క ప్రతిఫలం ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీథులో "అల్లాహ్ మార్గంలో" (ఫీ సబీలిల్లాహ్) అనే ఆయన ప్రకటన నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతిఫలం దానిపై ఆధారపడి ఉండుటను సూచిస్తుంది.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు, ధర్మపోరాట ఘనత