ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు…

ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.

అల్ బరఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించినారు, ఇద్దరు ముస్లింలు రోడ్డు మీద లేదా వేరే ఇతర చోట కలుస్తే, వారిలో ఒకడు మరొకరిని సలాం తెలుపుతూ చేతులు కలిపితే, వారు విడిపోయేలోగా (తమ తమ మార్గాల్లో వెళ్ళేందుకు విడి పోయే లోగా లేదా తమ తమ చేతులు వెనక్కు తీసుకునే లోగా), ఉభయుల పాపాలు క్షమించబడతాయి.

فوائد الحديث

కలుసుకునేటప్పుడు కరచాలనం చేయడం అంటే చేతులు కలపడం సిఫార్సు చేయబడింది మరియు ప్రోత్సహించబడింది.

అల్-మునావి ఇలా అన్నారు: ఎటువంటి ధర్మబద్ధమైన సాకు లేనప్పుడు కుడి చేతిలో కుడి చేతిని ఉంచడం ద్వారా (హ్యాండ్ షేఖ్ చేయడం ద్వారా) తప్ప సున్నతు ఆచరణ నెరవేరదు.

శాంతి శుభాకాంక్షల అభివాదాన్ని అంటే సలాంను వ్యాప్తి చేయడం ప్రోత్సహించబడింది మరియు ఒక ముస్లిం తన తోటి ముస్లింతో కరచాలనం చేసినప్పుడు లభించే గొప్ప ప్రతిఫలం హైలైట్ చేయబడింది.

ఈ హదీథులో ప్రతిపాదించబడిన కరచాలనం నుండి పరస్త్రీలతో కరచాలనం చేయడం వంటి నిషేధించబడిన కరచాలనము మినహాయించబడింది.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు, సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు