“నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్నైనా షైతాన్ తన కొరకు ‘హలాల్’ (అనుమతించ బడినదిగా) చేసుకుంటాడు

“నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్నైనా షైతాన్ తన కొరకు ‘హలాల్’ (అనుమతించ బడినదిగా) చేసుకుంటాడు

హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి భోజనం చేసిన సందర్భములలో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు చేతిని చాచే వరకు మేము మా చేతిని చాచే వారము కాము. ఒకసారి మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనానికి హాజరైనపుడు, ఒక చిన్న అమ్మాయి, ఎవరో ముందుకు తోస్తున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చి, ఆహారపు పళ్ళెములో తన చేయి పెట్టబోతుండగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె చేతిని పట్టుకున్నారు. అలాగే ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు రాగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్నైనా షైతాన్ తన కొరకు ‘హలాల్’ (అనుమతించ బడినదిగా) చేసుకుంటాడు. అతను (షైతాన్) ఈ చిన్న అమ్మాయిని తీసుకువచ్చాడు (ఆమె ద్వారా) ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు గాను, కానీ నేను ఆమె చేతిని పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకు వచ్చాడు, ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు. నేను అతని చేయి కూడా పట్టుకున్నాను. నా ఆత్మ ఎవరి చేతిలోనైతే ఉన్నదో, ఆయన సాక్షిగా, వాడి చేయి (షైతాను చేయి) ఆమె చేతితో పాటు నా చేతిలో ఉన్నది.”

[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]

الشرح

ఈ హదీథులో హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: వారు (సహాబాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎపుడు భోజనం చేసినా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు తన చేయి చాచనంత వరకు వారిలో ఎవరూ భోజనంలో చేయి పెట్టేవారు కాదు. ఆయన ఇంకా ఇలా అంటున్నారు: “ఒకసారి మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో భోజనం చేయడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక చిన్న బాలిక, ఎవరో తనను ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు వచ్చి ఆ భోజనములో చేయి పెట్టబోయింది. అయితే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆమె చేయి పట్టుకున్నారు. తరువాత ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడు ఆ భోజనంలో చేయి పెట్టకముందే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్ని అయినా షైతాను తినగలడు. షైతాను ఈ బానిస అమ్మాయిని తీసుకువచ్చాడు, తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ నేను ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకువచ్చాడు తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ అతని చేతిని కూడా నేను పట్టుకున్నాను. ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో ఆయన సాక్షిగా ఆమె చేతితో పాటు షైతాను చేయి కూడా నా చేతిలో ఉన్నది.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు ఉచ్ఛరించి భోజనాన్ని తిన్నారు.

فوائد الحديث

ఈ హదీథులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల సహచరుల గౌరవం మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో వారి ఉన్నత మర్యాద, వారి ప్రవర్తన, ఉత్తమమైన వ్యవహారం తీరు చూడవచ్చు.

భోజనం భుజించుట యొక్క మర్యాదలలో ఒకటి - వారిలోని పెద్దవాడు మరియు మరింత ఘనత కలిగిన వాడు, సద్గుణవంతుడు తినడం ప్రారంభించే వరకు చిన్నవాడు వేచి ఉండటం.

ఈ హదీథులో ప్రస్తావించబడిన వాటితో సహా, తన లక్ష్యాలను సాధించడానికి, షైతాను నిర్లక్ష్యంగా ఉండే కొంతమంది ప్రజలను తనకు ఇష్టమైన పనులను చేయమని ముందుకు పురిగొల్పుతాడు.

ఇమాం అన్-నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ధర్మపండితులు ఇలా అన్నారు: భోజనం తినడం ప్రారంభించడానికి ముందు ఇతరులు విని అప్రమత్తమయ్యేలా బిస్మిల్లాహ్‌ అని బిగ్గరగా చెప్పడం మంచిది.”

ఒకవేళ ఎవరైనా వచ్చి తినడానికి కూర్చుని, అతడు బిస్మిల్లాహ్ పఠించడం మీరు వినకపోతే, అతడు బిస్మిల్లాహ్ పఠించే వరకు మీరు అతని చేయి పట్టుకుని ఆపవచ్చు.

ఎదురుగా జరుగుతున్న కీడును మంచిగా మార్చడం ఙ్ఞానం కలిగిన వారిపై విధి; అలాగే జరుగుతున్న చెడుని చేతితో ఆపడం అనేది అలా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవారిపై విధి.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వానికి ఈ హదీథు ఒక నిదర్శనం; ఎందుకంటే అసలు కథ ఏమిటనేది అల్లాహ్ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిపినాడు.

విశ్వాసుల ఆహారాన్ని షైతాన్ తినలేడు – వారు తినడానికి ముందు అల్లాహ్ పేరుని ఉచ్చరించకుండా ఉంటే తప్ప.

అలాగే ఇందులో తినుట మరియు త్రాగుటకు సంబంధించిన విధివిధానాలు మరియు మర్యాదలను ప్రజలకు బోధించుట సిఫారసు చేయబడుతున్నది.

శ్రోతలకు విషయాన్ని నొక్కి చెప్పడానికి అల్లాహ్ పై ప్రమాణం చేయడం వాంఛనీయం.

ఇమాం అన్-నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: నీరు, పాలు, తేనె, రసం, ఔషధం మరియు ఇతర పానీయాలు త్రాగేటప్పుడు బిస్మిల్లాహ్ చెప్పడం ఆహారం మీద బిస్మిల్లాహ్ చెప్పడం లాంటిదే.

ఇమాం అన్-నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, మతిమరుపుతో, అజ్ఞానంతో, బలవంతంగా లేదా మరేదైనా అడ్డంకి కారణంగా భోజనం ప్రారంభంలో అల్లాహ్ పేరును ఉచ్చరించకపోతే, కానీ తరువాత భోజనం చేసేటప్పుడు అలా చేయగలిగి పరిస్థితి ఏర్పడితే, అతడు ఇలా పలకాలి అని సిఫార్సు చేయబడింది: “బిస్మిల్లాహి అవ్వలుహు వ ఆఖిరుహు” (అల్లాహ్ నామంతో దాని ప్రారంభము మరియు దాని ముగింపు కూడా).

التصنيفات

తినే మరియు త్రాగే పద్దతులు